ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు మౌనవ్రతంలోని గొప్పతనం తెలుసా? అయితే ఇలా ఉండరు.. ప్రశాంత చిత్తంతో లక్ష్యాన్ని చేరుకుంటారు!

ABN, First Publish Date - 2021-12-23T14:06:57+05:30

చాలామంది అనుకుంటున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలామంది అనుకుంటున్నట్లు మౌనవ్రతం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. మీలోని శక్తియుక్తులను తెలుసుకోవడం. నేటి జీవనశైలిలో మనం విశ్రాంతి తీసుకోవడం కన్నా, మానసిక ఒత్తిడికి, నిరాశకు అధికంగా గురవుతున్నాం. వీటికి పరిష్కారంగా కొంతమంది తమ జీవనశైలిలో ధ్యానం, యోగాలను భాగస్వామ్యం చేసుకుంటున్నారు. అయితే మన బిజీ యాక్టివిటీస్ వల్ల యోగా, మెడిటేషన్‌లను సరిగా చేయలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు మౌనవ్రతం పాటించడం దివ్య ఔషధం లాంటిది. మౌనవ్రతాన్నిఋషులు, సాధువులు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. పురాతన కాలంలో రుషులు.. జీవితంలో నిశ్శబ్ధానికిగల విలువను అర్థం చేసుకున్నారు. మాటలను నియంత్రించగల శక్తిని గ్రహించారు. మౌనవ్రతం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటమే కాదు. ఇది మీ శక్తియుక్తుల గురించి సంపూర్ణంగా తెలుసుకునేందుకు తోడ్పడే ఉత్తమ సాధన. ఇప్పుడు మౌనవ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడంతో పాటు మౌనవ్రతం వలన మనకు కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.


ఎలా చేయాలి?

భారతీయ సంస్కృతిలో మౌనవ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మౌనవ్రతం ఆచరించేందుకు ప్రత్యేక విధివిధానమంటూ ఏదీ లేదు. దీనిని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. తొలుత మీరు దీనిని ఒక రోజుతో ప్రారంభించవచ్చు. తరువాత మీ సామర్థ్యం మేరకు దాని సమయ పరిమితిని పెంచుకోవచ్చు.

ఆలోచనలు, మాటలపై నియంత్రణ

అన్నిరకాల ఆలోచనలను మాటల్లోకి తీసుకువచ్చి మరింత గందరగోళానికి లోనుకాకుండా ఉండేందుకు మౌనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా క్రమేణా మన ఆలోచనలపై నియంత్రణను సాధించి, ప్రశాంతతను అందుకోగలం. తద్వారా మంచి ఆలోచనలు చేయగలిగి, మన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే పనులను చేయగలుగుతాం. 

ఆత్మపరిశీలన,అంతర్గత శాంతి

మౌనవ్రతాన్ని ఆచరించడం వలన మనం ఆత్మపరిశీలన చేసుకోగలుగుతాం. ఇదే సమయంలో మనం అంతర్గత శాంతి వైపు దృష్టి పెట్టగలుగుతాము. మన అన్ని ఆలోచనలను బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఉండాలనే చేతన మన ప్రతిభను ద్విగుణీకృతం చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం అనుకున్న పనులను సక్రమంగా చేయగలుగుతాం. 


కోపంపై నియంత్రణ 

మిమ్మల్ని చీటికీ మాటికీ వేధిస్తూ, ప్రతికూల శక్తితో బాధించే వ్యక్తులు మీ చుట్టూ ఉండొచ్చు. అలాంటివారిపై మీకు కోపం వస్తుంటుంది. కోపం అనేది నియంత్రించడం కష్టమైన భావోద్వేగం. అయితే నిశ్శబ్ధం అనేది భావోద్వేగ ప్రతిస్పందనలు నియంత్రిస్తుంది. మౌనవ్రతం ఆచరించే వ్యక్తి తన భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుని, వాటిని నియంత్రించుకోగలుగుతాడు. 

ఉత్తమ వ్యక్తిత్వం

నిశ్శబ్ధం అనేది ఒక కళ. దాని గొప్పదనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడంతో పాటు, అందరి గౌరవ మర్యాదలను అందుకుంటాడు. నిశ్శబ్ధం అనేది ప్రశాంత జీవితాన్ని అందించడంతోపాటు ఏకాగ్రతతో కూడిన ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందుకోవడంలో సహాయపడుతుంది.

Updated Date - 2021-12-23T14:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising