ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపరిచితుడి దగ్గర అనుకోకుండా కొన్న ఒక మామిడి మొక్క.. జీవితాన్నే మార్చేసింది!

ABN, First Publish Date - 2021-06-20T14:33:39+05:30

ఒక్కోసారి అనుకోకుండా తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే మనల్ని అదృష్టవంతుల్ని చేస్తాయి. మన జీవితాలను మార్చేస్తాయి. అలాగే జరిగింది సంకల్ప్ సింగ్ పరిహార్ అనే ఒక రైతు విషయంలో.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కోసారి అనుకోకుండా తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే మనల్ని అదృష్టవంతుల్ని చేస్తాయి. మన జీవితాలను మార్చేస్తాయి. అలాగే జరిగింది సంకల్ప్ సింగ్ పరిహార్ అనే ఒక రైతు విషయంలో. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన అతను నాలుగేళ్ల క్రితం తన పొలంలో కొబ్బరి చెట్లు వేయాలని అనుకున్నాడు. హైబ్రీడ్ కొబ్బరి విత్తనాలు కొనుగోలు చేయాలని చెన్నై బయలుదేరాడు. రైల్లో ఉండగా సంకల్ప్‌కు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన వద్ద ఒక ప్రత్యేకమైన మామిడి మొక్కలు ఉన్నాయని, ఒక్కో మొక్క రూ.2,500 ధర పలుకుతుందని అన్నాడు. ఈ మామిడి మంచి లాభాలు తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెప్పాడు. అతని మాటలు విన్న తర్వాత ధైర్యం చేసి ఆ మామిడి మొక్కను కొనేశాడు సంకల్ప్.




అలా అతను కొన్న మొక్క మామూలుది కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ జాతికి చెందిన మామిడి మొక్క. ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో పండుతాయి. ఒక్కొక్క మామిడి కాయ కనీసం 50 డాలర్లు (రూ.3,700 పైగా) ధర పలుకుతుంది. వీటిని జపాన్‌లో వేలంపాట వేసి అమ్ముతారంటేనే వీటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. 2019లో ఒక రెండు మామిడి పండ్లను ఏకంగా 4,500 డాలర్లకు వేలంపాడి కొనుక్కున్నారు. ఇంత స్పెషల్ మామిడి సంకల్ప్ పొలంలో పండిందని తెలుసుకున్న చుట్టుపక్కలి వ్యాపారస్థులు సంకల్ప్‌ను కలిసి రూ.21వేలకు మామిడి కాయలు అమ్మాలని అడగడం ప్రారంభించారు. దీంతో తను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఎంతలా మార్చిందో సంకల్ప్‌కు అర్థమైంది. అయితే తన పొలం మొత్తం ఈ మామిడి చెట్లు పండించేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఈ పంటను కాపాడుకోవడం కోసం రూ.8వేల జీతంతో పదిమంది సెక్యూరిటీ గార్డులను కూడా నియమించుకున్నాడు.



Updated Date - 2021-06-20T14:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising