ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకేస్తానన్న యువతి.. కాపాడిన పోలీసులు.. ఆమె చెప్పింది విని..!

ABN, First Publish Date - 2021-07-26T18:39:12+05:30

ఓ యువతి ఫరీదాబాద్ మెట్రో స్టేషన్‌‌లో అలజడి సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ యువతి ఫరీదాబాద్ మెట్రో స్టేషన్‌‌లో అలజడి సృష్టించింది. స్టేషన్ బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువతిని కాపాడారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో తెలుసుకుని షాకయ్యారు. ఈ నెల 24న హర్యానాలోని ఫరిదాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.


శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఫరిదాబాద్‌ మెట్రో స్టేషన్ బాల్కని పైకి చేరుకున్న యువతి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, మెట్రో సిబ్బంది, ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారు. ఆమెను మాటల్లో పెట్టి ఇద్దరు పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లారు. చివరకు ఎంతో కష్టపడి ఆమెను కాపాడగలిగారు. 


అనంతరం ఆమె చర్యకు గల కారణం గురించి విచారించారు. ’నేను సెక్టార్-2 లో ఉన్న ఓ ప్రైవేట్‌ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా ప్రియుడు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ విషయమై మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను చెప్పిన మాటను నా ప్రియుడు వినలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని ఇలా మెట్రో స్టేషన్‌కు వచ్చాను’ అని ఆ యువతి అసలు విషయం చెప్పేసింది. దీంతో పోలీసులు తెల్లబోయారు. అప్పటికే అక్కడకు చేరుకున్న యువతి సోదరుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. యువతిని కాపాడిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2021-07-26T18:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising