ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హృదయ విదారకర ఘటన.. మంచంపై ఓ మహిళను 12 కిలోమీటర్ల దూరం పాటు మోసుకెళ్లి..

ABN, First Publish Date - 2021-09-14T17:46:54+05:30

అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం.. అయినా కనీస సౌకర్యాలు కూడా లేవు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం.. అయినా కనీస సౌకర్యాలు కూడా లేవు.. ఓ మహిళ అనారోగ్యానికి గురై చావుబతుకుల మధ్య ఉంటే అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు.. దీంతో చేసేదేం లేక ఆమె బంధువులు మంచం మీద ఆమెను 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి మోసుకెళ్లారు.. ఝార్ఖండ్‌లోని షాహిబ్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


షాహిబ్‌గంజ్ జిల్లాలోని గడాయ్ దియార గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. సక్రమమైన రోడ్డు మార్గం లేకపోవడం వలన ఆ గ్రామానికి రవాణా సౌకర్యం కూడా లేదు. దీంతో ఆమె బంధువులు ఆమెను ఓ మంచంపై పడుక్కోబెట్టి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి మోసుకెళ్లారు. గడాయ్ దియార గ్రామం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రాతినధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనిది కావడం గమనార్హం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పరిస్థితే అలా ఉంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 



Updated Date - 2021-09-14T17:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising