ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్ ప్రధాని చనిపోయాడా..? ఆ వార్తలేంటంటే..

ABN, First Publish Date - 2021-08-18T11:30:36+05:30

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలైంది. ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలైంది. ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన నిజంగానే చనిపోయాడనుకుని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు విపరీతంగా శ్రద్ధాంజలి మెసేజ్‌లు పెట్టారు. ప్రధానంగా ట్విటర్‌లో #RIPImranKhan హ్యాష్ ట్యాగ్‌ను టాప్‌లో ట్రెండ్ చేసి మరీ ట్వీట్‌లు చేశారు. అయితే ఆ పోస్ట్ అబద్ధమని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


మంగళవారం రాత్రి పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ ఆసుపత్రి బెడ్‌పై పడుకుని మీడియాతో మాట్లాడుతున్న ఓ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోతో పాటు ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని, ఇక పాక్ ప్రధాని లేరని పుకార్లు షికారు చేశాయి. ఇదంతా నిజమని నమ్మిన పాక్ ప్రజలు, ఆయన అభిమానులు ఆయన మృతి పట్ల తమ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్లో ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. 


ఇక కొంతమంది ఏకంగా ఇమ్రాన్ ఎలా చనిపోయారో కూడా వివరించారు. కరాచీలో జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్‌లో ఆయన మరణించారని రాసుకొచ్చారు. అయితే ఆ వార్త ఫేక్ అని, అలాగే ఆ వీడియో ఇప్పటిది కాదని, ఇంతకుముందు ఎప్పుడో ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలోదని తేలడంతో అంతా సర్దుమణిగింది. 



Updated Date - 2021-08-18T11:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising