ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాయామం చేయకూడదా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

ABN, First Publish Date - 2021-06-18T22:13:46+05:30

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చెయ్యవచ్చా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చెయ్యవచ్చా? వ్యాయామం వల్ల వ్యాక్సిన్ పనితీరు మెరుగుపడుతుందా? అవుననే అంటున్నారు వైద్యులు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి శరీరం కరోనా వ్యాక్సిన్‌కు బాగా స్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. వ్యాయాయం చేయనివారితో పోల్చుకుంటే చేసే వారిలో దాదాపు 50 శాతానికి పైగా అధిక స్థాయిలో యాంటీబాడీలు విడుదలయ్యాయని గుర్తించారు. గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 


కరోనా వ్యాక్సిన్ మాత్రమే కాకుండా వ్యాయామం కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు సూచించారు. వీరి శరీరం వ్యాక్సిన్‌కు అద్భుతంగా స్పందిస్తోందని తెలిపారు. శారీరక వ్యాయామం అనారోగ్య ముప్పును తగ్గించడమే కాకుండా వైరస్‌ల బారిన పడకుండా రక్షిస్తుందన్నారు. అలాగే టీకా సమర్థతను కూడా వ్యాయామం పెంచినట్టు తేలింది.


వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాధారణంగానే ఉంటే వ్యాయామం ఆపాల్సిన పని లేదని తెలిపారు. కఠినమైన వర్కవుట్లు కాకుండా తేలికపాటి వ్యాయామం చేయాలన్నారు. ఒకవేళ జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటే అవి తగ్గేవరకు వ్యాయామం జోలికి వెళ్లవద్దని సూచించారు. రెండ్రోజుల విరామం తీసుకుని ఆ తర్వాత మొదలుపెట్టాలని తెలిపారు. 

Updated Date - 2021-06-18T22:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising