ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి.. హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. తలుపులు మూసేసి మరీ దారుణం.. తెల్లారేసరికి..

ABN, First Publish Date - 2021-11-25T23:03:44+05:30

ప్రేమ అతడిని పశువుగా మార్చింది.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం కుదరలేదనే కారణంతో అతడు మానవత్వాన్ని మర్చిపోయాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ అతడిని పశువుగా మార్చింది.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం కుదరలేదనే కారణంతో అతడు మానవత్వాన్ని మర్చిపోయాడు.. తను ప్రేమించి యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులందరిపైనా కసి పెంచుకున్నాడు.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో అందరినీ నరికేశాడు.. అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఓ యువతి ప్రాణాలతో పోరాడుతోంది.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ అనే యువకుడు గోండా ప్రాంతానికి చెందిన సప్న అనే యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో సప్న తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. సప్నకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న అశోక్ కుమార్ తన ప్రేయసితోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని హతమార్చాలనుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై సప్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు. 


నిద్రపోతున్న సప్న తల్లిదండ్రులు దేవి ప్రసాద్, పార్వతీ దేవిని ముందుగా కత్తితో నరికేశాడు. ఆ తర్వాత సప్నపై, ఆమె సోదరి ఉపాసనపై దాడి చేశాడు. అనంతరం గోడ దూకి పారిపోయాడు. ఈ దాడిలో సప్న, ఆమె తల్లిదండ్రులు అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాపడిన ఉపాసన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫొటోను విడుదల చేసి పట్టించిన వారికి రూ.50 వేలు బహుమతి కూడా ప్రకటించారు. 

Updated Date - 2021-11-25T23:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising