ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగేళ్ల శిక్ష పడితే రెండ్రోజుల్లోనే బయటకు వచ్చేశాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు.. అసలు విషయం అప్పుడు బయటపడింది!

ABN, First Publish Date - 2021-12-15T18:27:32+05:30

అతడికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. జైలుకు వెళ్లిన రెండ్రోజులకే అధికారులు అతడిని విడుదల చేసేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. జైలుకు వెళ్లిన రెండ్రోజులకే అధికారులు అతడిని విడుదల చేసేశారు.. దీంతో సంతోషంగా అతను తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ ఫొటోలను చూసిన అతని స్నేహితుడు ఎంక్వైరీ చేశాడు.. దీంతో అసలు విషయం బయటపడింది.. జైలు అధికారుల తప్పిదం వల్లే అతను బయటకు వచ్చాడని తెలిసింది.. దీంతో మళ్లీ జైలు పాలయ్యాడు.


ఒక వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో దోషిగా నిరూపణ కావడంతో లారాస్ మాటియుసోవాస్ అనే వ్యక్తికి ఉత్తర లండన్‌లోని వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. నాలుగేళ్ల శిక్ష కోసం జైలుకు వెళ్లిన లారాస్ రెండ్రోజుల్లోనే విడుదల అయిపోయాడు. దీంతో సంతోషంతో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలను చూసిన లారాస్ స్నేహితుడు ఒకరికి అనుమానం వచ్చింది. 


నాలుగేళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి రెండ్రోజుల్లోనే బయటకు ఎలా వచ్చాడని అతను ఆరా తీశాడు. జైలు సిబ్బంది లంచం తీసుకుని లారాస్‌ను వదిలేశారని సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. ఆ విషయం జైలు అధికారుల వరకు చేరడంతో వారు లారాస్ విడుదల గురించి విచారించారు. కోర్టులోని రాత పనుల్లో తలెత్తిన లోపం కారణంగానే లారాస్ విడుదలయ్యాడని గుర్తించారు. వెంటనే లారాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో లారాస్ మళ్లీ జైలుపాలయ్యాడు. 

Updated Date - 2021-12-15T18:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising