ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: మేఘాలకి కరెంట్ షాకిచ్చి వర్షం కురిపించారు!

ABN, First Publish Date - 2021-07-22T21:46:06+05:30

శాస్త్రజ్ఞులు ఓ వినూత్న ప్రయోగం చేశారు. మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాకిచ్చారు. దీంతో.. మండువేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి, వాతావరణం చల్లబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: అసలే ఎడారి ప్రాంతం.. ఆపై మండువేసవి..50 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..ఇటువంటి వాతావరణంలో ఉండాలంటే మామూలు విషయం కాదు. ఏసీలకు లొంగే వేడి కాదు అది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. ఇంకెక్కడండీ.. దుబాయ్‌లోనే! అక్కడి ప్రజలు గ్రీష్మతాపాన్ని తట్టుకోలేక నానా అవస్తలూ పడుతున్నారు. 


దీంతో యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటియొరాలజీ(వాతావరణ పరిశోధన కేంద్రం)లోని శాస్త్రజ్ఞులు ఓ వినూత్న ప్రయోగం చేశారు. మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాకిచ్చారు. దీంతో.. మండువేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి, వాతావరణం చల్లబడింది. మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక వ్యవస్థలున్న డ్రోన్లను ఆకాశంలోకి పంపించి వర్షం కురిపించారు! నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరెంట్ షాకుల ద్వారా మేఘాల్లో మార్పులు జరిగి వాన కురుస్తుందట. జోరున వానలో రహదారులపై దూసుకుపోతున్న కార్ల వీడియోను మెటియొరాలజీ కేంద్రం వారు ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2021-07-22T21:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising