ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు... 28 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి...

ABN, First Publish Date - 2021-04-04T15:07:43+05:30

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల అశోక్ థాపా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల అశోక్ థాపా తాను ప్రాణాపాయ స్థితిలో పడినప్పటికీ, ఎంతో అప్రమత్తతతో 28 మంది ప్రాణాలు కాపాడారు. ప్రైవేటు బస్సు నడుపుతున్న థాపాకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే దీనిని గ్రహించిన థాపా బస్సును చెట్ల పొదల్లోకి పోనిచ్చి నిలిపివేశారు. 


ఈ విధంగా థాపా... బస్సులోని 28 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన శిమ్లా పరిధిలోని శిర్‌మౌర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు బస్సు రేణుకాజీ సతౌన్ నుంచి పావంటా వైపు వెళుతోంది. ఈ సమయంలో బస్సు నడుపుతున్న థాపాకు గుండెపోటు వచ్చింది. కళ్లు మూతపడుతున్నాయి. తన పరిస్థితిని గ్రహించిన థాపా వెంటనే బస్సును చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి నిలిపివేశారు. థాపా పరిస్థితిని గమనించిన ప్రయాణికులు అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ థాపా మృతి చెందారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకుర్ మాట్లాడుతూ థాపాను ఆసుపత్రికి తీసుకువచ్చేలోగానే అతను మృతి చెందారని తెలిపారు. గుండెపోటు కారణంగా థాపా మృతి చెందారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-04T15:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising