ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడి నీళ్లు తాగితే.. కరోనా సోకదా?

ABN, First Publish Date - 2021-05-13T15:53:32+05:30

ప్రస్తుతం కరోనాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం కరోనాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించిన వార్తలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. వీటిల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా చాలా మంది వాటిని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వేణ్నీళ్లతో స్నానం చేసినా, వేణ్నీళ్లు తాగినా కరోనా సోకదనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అందరూ వీటిని బలంగా నమ్ముతుండడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 


వేడి నీళ్లు కరోనాను పారదోలుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రయోగశాలల్లో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది. బాగా వేడిగా ఉండే నీళ్లు తాగితే కడుపులో అల్సర్లు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. గోరు వెచ్చని నీరు కరోనా వైరస్‌ను చంపకపోవచ్చు కానీ, ఆ నీరు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వేడి నీళ్ల స్నానం కూడా శరీరానికి మంచి చేస్తుంది. కరోనా నివారణకు మాత్రం మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలి.  

Updated Date - 2021-05-13T15:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising