ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింత చెట్టు.. దీనిని నరికితే రక్తం వస్తుంది..!

ABN, First Publish Date - 2021-06-12T22:19:48+05:30

ఈ భూమికి అధిపతి అని భావిస్తున్న మనిషికి తెలియని ఎన్నో వింతలు, విచిత్రాలు ఈ ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ భూమికి అధిపతి అని భావిస్తున్న మనిషికి తెలియని ఎన్నో వింతలు, విచిత్రాలు ఈ ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి. మ‌నుషుల‌కు తెలియ‌ని చాలా ర‌హ‌స్యాలు ఇంకా ఈ విశ్వంలో బోలెడు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అనేక కొత్త విషయాలు బయటకు వచ్చి మనుషులను ఆశ్చర్యపరుస్తుంటాయి. యెమన్‌లోని సాకోత్రా ద్వీపసమూహంలో కనిపించే `డ్రాగన్ బ్లడ్ ట్రీ` గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. 


ఈ చెట్లు తిరగబడిన గొడుగు ఆకారంలో ఉంటాయి. ఇవి 650 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇవి 33 నుంచి 39 అడుగుల వరకు పెరుగుతాయి. వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. చెట్టు పైభాగంలో ఆకులు, కొమ్మలు దట్టంగా ఉంటాయి. అన్నింటికంటే విశేషమేమిటంటే.. ఈ చెట్టు బెరడును నరికితే అచ్చం రక్తంలా ఉండే ద్రవం బయటకు వస్తుంది. బెరడును కత్తిరిస్తే దాని నుంచి ఎర్ర రంగు రెసిన్లు బయటకు వస్తాయి. ఆ ద్రవ‌ం అచ్చం ర‌క్తంలాగే కనిపిస్తుంది. దీనిని డ్రాగన్ జంతువు రక్తం అని స్థానికులు భావిస్తుంటారు. అందుకే ఈ మొక్కకు ఆ పేరు వచ్చింది. ఆ ద్రవాన్ని ఔషదంగా ఉపయోగిస్తారు. ఈ ద్రవం జ్వరం, అల్సర్, నొప్పులు తగ్గిస్తుందని, లైంగిక శక్తిని పెంచుతుందని భావిస్తారు. 


ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం గల, విభిన్నమైన ప్రాంతంగా గుర్తించింది. ఈ చెట్ల కారణంగానే సాకోత్రా ద్వీపసమూహంలో నీటి కొరత లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ దీవిలో సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు.


ప్రమాదంలో డ్రాగన్ బ్లడ్ ట్రీ

వందల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్న, ఇన్ని ఉపయోగాలు కలిగిన ఈ చెట్లు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. తీవ్ర తుఫానుల కారణంగా సాకోత్రా ద్వీపంలో ఉన్న డ్రాగన్ బ్లడ్ ట్రీ ఫారెస్ట్ నాశనమవుతోంది. ఇక, వీటి విత్తనాల నుంచి వస్తున్న చిన్న చిన్న మొక్కలను మేకలు, ఇతర జంతువులు తినేస్తున్నాయి. 


జీవ వైవిధ్యానికి ప్రతీకలైన ఈ చెట్లు అంతరించడం త్వరలో తలెత్తబోయే పర్యావరణ సంక్షోభానికి హెచ్చరిక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చెట్లు పునరుత్పత్తి చేయడానికి దాదాపు అర్ధ శతాబ్దం పడుతుంది. ఈ సమయంలో ఈ చెట్లను రక్షించలేకపోతే ఈ జాతి మొత్తం అంతరించిపోవడానికి ఎక్కువ సమయం పట్టదని పర్యావరణ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.  

Updated Date - 2021-06-12T22:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising