ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్నం తీసుకురాలేదని ఎలా వేధించారంటే.. మామ, మరిది తుపాకీ గురిపెట్టి.. భర్తకు విషయం చెబితే..

ABN, First Publish Date - 2021-12-06T17:27:10+05:30

కట్నం తీసుకురాలేదనే కోపంతో ఓ కుటుంబం కోడలితో దుర్మార్గంగా ప్రవర్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కట్నం తీసుకురాలేదనే కోపంతో ఓ కుటుంబం కోడలితో దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించింది. వావి వరసలు మరిచిపోయి భర్త సోదరుడు, తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్త కూడా వారికే మద్దతుగా నిలిచింది. భర్తకు విషయం చెబితే.. అతను పట్టించుకోలేదు. పైగా భార్యనే బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


సోనిపట్‌కు సమీపంలోని పాల్వల్ గ్రామానికి చెందిన ఓ యువకుడిని బాధిత మహిళ 2013లో వివాహం చేసుకుంది. అప్పట్నుంచి కట్నం గురించి అత్తింటి వారు వేధిస్తున్నారు. వారి వేధింపులను మౌనంగా భరిస్తున్న ఆమెకు ఇటీవల మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఇటీవల ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించిన మరిది తుపాకీ గురి పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఆ విషయాన్ని భర్తకు చెబితే అతను పట్టించుకోలేదు. పైగా విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 


మరో వారం రోజులకు భర్త తండ్రి కూడా ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు యువతి ప్రతిఘటించింది. దీంతో భర్త, అత్త, మామ, మరిది కలిసి ఆమెను కొట్టారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

Updated Date - 2021-12-06T17:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising