ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కను బైక్‌కి కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన యువకుడు అరెస్ట్

ABN, First Publish Date - 2021-02-17T17:55:55+05:30

గుజరాత్‌లోని సూరత్‌లో ఒక హృదయవిదారక ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మహావీర్ కాలనీలో ఈ అమానవీయ ఉదంతం కనిపించింది. ఇద్దరు యువకులు ఒక వీధి కుక్కను తాడుతో బంధించి, దానిని బైక్‌కు కట్టి రోడ్డుమీద ఈడ్డుకుంటూ వెళ్లారు. అదే దారిలో వెళుతున్న ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు దర్యాప్తు చేపట్టి ఒక యువకుడిని అరెస్టు చేశారు. 


ఈ వీడియోను చూసిన సామాజిక కార్యకర్త సలోనీ రాఠీ స్వయంగా ఖడోదరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటన వెసూలోని భగవాన్ మహావీర్ కాలేజీ సమీపంలోని రోడ్డుపై జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన హితేష్(32)ను అరెస్టు చేశామని, హితేష్‌కు సహకరించిన మరో యువకుడు పరారయ్యాడని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. 

Updated Date - 2021-02-17T17:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising