ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంటల్లో ఆసుపత్రి.. ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేసిన వైద్యులు

ABN, First Publish Date - 2021-04-03T03:24:39+05:30

ఓ రోగికి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆసుపత్రి మంటల్లో చిక్కుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఓ రోగికి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆసుపత్రి మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ వైద్యులు మాత్రం ఏమాత్రం భయపడకుండా, గందరగోళానికి తావివ్వకుండా ఆపరేషన్‌ను పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడారు. రష్యాలో జరిగిందీ ఘటన.  బ్లాగోవెష్‌చెన్స్క్‌లోని టిసారిస్ట్-ఎరా ఆసుపత్రి రూఫ్‌పై ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో 8 మంది వైద్యులు ఓ రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు. వారికి సహాయంగా ఓ నర్స్ ఉంది. 


మరోవైపు, అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లోనే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అదే సమయంలో ఆసుపత్రిలో క్లిష్టతరమైన ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పొగ గదిలోకి వెళ్లకుండా పెద్దపెద్ద ఫ్యాన్లు పెట్టి పొగ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే, విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 


ఆ సమయంలో రోగి ప్రాణాలు కాపాడడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని సర్జన్ వేలెంటిన్ ఫిలతోవ్ పేర్కొన్నారు. అది హార్ట్ బైపాస్ ఆపరేషన్ అని ఆయన తెలిపారు. కాగా, ఆసుపత్రిలో మంటలు చెలరేగిన వెంటనే 128 మందిని అక్కడి నుంచి తరలించామని ఎమర్జెన్సీ మంత్రి ఒకరు తెలిపారు.


కాగా, ఈ ఆసుపత్రిని శతాబ్దం క్రితం అంటే 1907లో నిర్మించారు. పైకప్పును కలపతో నిర్మించడంతో మంటలు శరవేగంగా వ్యాపించినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా తప్పించుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వైద్యులకు, అగ్నిమాపక సిబ్బందిపై స్థానిక ప్రాంతీయ గవర్నర్ వసిలీ ఓర్లోవ్ ప్రశంసలు కురిపించారు.  

Updated Date - 2021-04-03T03:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising