ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధుని బోధ: మీకు దేవుడిని చూడాలని ఉందా? అయితే అక్కడ వెదకండి.. తప్పక కనిపిస్తాడు!

ABN, First Publish Date - 2021-11-17T13:29:20+05:30

ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని దగ్గరకు వచ్చి.. తాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని దగ్గరకు వచ్చి.. తాను 20 ఏళ్లుగా దేవుని కోసం అన్వేషిస్తున్నానని, అయినా దేవుడిని  కనుగొనలేకపోయానన్నాడు. వెంటనే బుద్ధుడు స్పందిస్తూ.. "దేవుని కనుగొనడానికి మీరు ఏమి చేశారు" అని అడిగాడు? దానికి సమాధానంగా అతను ‘‘ నేను అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాను. లెక్కకుమించి దానధర్మాలు చేశాను. దేవాలయాలు, మతపరమైన స్థలాలను నిర్మించాను, అయినా దేవుడు ఎక్కడా కనిపించలేదు’’ అని మొరపెట్టుకున్నాడు. బుద్ధుడు.. "నేను మీకు సహాయం చేస్తాను" అని హమీనిస్తూ..‘‘మీరు సాయంత్రం నా దగ్గరకు రండి’’ అని చెప్పి, అతనిని పంపించాడు. సాయంత్రం కాగానే బుద్ధుడు.. ఏదో వెదకడం ప్రారంభించాడు. బుద్దుడిని చూసిన శిష్యులు.. ‘‘మహాత్మా.. మీరు దేనికోసం వెదుకుతున్నారు?’’ అని అడిగారు. 


బుద్ధుడు.. ‘‘నేను ఒక విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నాను, దాని కోసం వెదుకుతున్నాను’’ అని చెప్పి, తిరిగి వెదకడం మొదలు పెట్టాడు. దీంతో వారు కూడా ఆ వజ్రం కోసం వెదకడం ప్రారంభించారు. ఇంతలో ఉదయం బుద్ధుడిని కలుసుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను ‘‘మహాత్మా.. మీరంతా దేనికోసం వెదుకుతున్నారు?’’ అని అడిగాడు.. ‘‘నా వజ్రం ఎక్కడో పోయింది.. దానికోసం వెతుకుతున్నాను’’ అని బుద్ధుడు చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి కూడా వజ్రం కోసం వెదకడం మొదలుపెట్టాడు. ఎంత వెదికినా ఎవరికీ వజ్రం దొరకలేదు. దీంతో ఆ వ్యక్తి బుద్ధునితో.. ‘చివరిసారిగా మీరు వజ్రాన్ని ఎక్కడ చూశారు?’’ అని అడిగాడు. బుద్ధుడు కాసేపు ఆలోచించి ‘ఆ గుడిసెలోపల చూశానని చెప్పాడు... దీంతో ఆ వ్యక్తి కోపగిస్తూ.. ఆ గుడిసెలో వజ్రం పోతే అక్కడే వెదకాలిగానీ.. మీరు బయట ఎందుకు వెదుకుతున్నారు? ఈ విధంగా మీరు మీ సమయాన్ని, ఇతరుల సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని అన్నాడు. వెంటనే బుద్ధుడు నవ్వుతూ..‘ ఇదే విషయాన్ని నేను మీకు వివరించాలనుకున్నాను. మీరు నిజంగా దేవుడిని చూడాలనుకుంటే అక్కడ, ఇక్కడ తిరగడం మానేసి, దేవునిపై సంపూర్ణంగా దృష్టిసారించండి అప్పుడు భగవంతుడు దొరుకుతాడని’’ చెప్పాడు. 


Updated Date - 2021-11-17T13:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising