ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ యువతి టాలెంటే వేరు.. ఆమె ఇంటి గోడలను మొత్తం దేనితో నింపిందో తెలుసా..

ABN, First Publish Date - 2021-11-12T02:50:09+05:30

ఇక్కడ మనం చెప్పుకోబోయే యువతి ఇంకొంచెం వెరైటీ. తన ఇంటి గోడలనే ఆదాయ వనరుగా మార్చుకుంది. ఆమె తన తెలివికి మరింత పదునుపెట్టి ఎవరూ ఊహించని విధంగా చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. ఎవరేమనుకున్నా వారి హాబీస్‌ని మాత్రం వదులుకోరు. కొందరికి వివిధ వ్యాపారాలపై ఆసక్తి ఉంటే.. ఇంకొందరు తమ టాలెంట్‌కి పదును పెట్టి, ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదిస్తుంటారు. అలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. వారి వినూత్న ఐడియాలే వారికి ఆదాయాన్ని సమకూరుస్తుంటాయి. ఇక్కడ మనం చెప్పుకోబోయే యువతి ఇంకొంచెం వెరైటీ. తన ఇంటి గోడలనే ఆదాయ వనరుగా మార్చుకుంది. ఆమె తన తెలివికి మరింత పదునుపెట్టి ఎవరూ ఊహించని విధంగా చేసింది. ఇంటి గోడలను ఇలా కూడా మార్చవచ్చా అనిపించేలా.. ఈ యువతి వ్యవహరిస్తోంది.


అమెరికాకు చెందిన ఓ యువతి చేస్తున్న పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. టెక్సాస్‌లో నివాసం ఉంటున్న ఎరికా థాంప్సన్ అనే యువతి తేనెను సేకరిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెకు ఓ ఐడియా వచ్చింది. ఎక్కడికో వెళ్లి తేనెను సేకరించడం కంటే.. తన వద్దకే తేనెను రప్పించుకుంటే ఎలా ఉంటుంది.. అని ఆలోచించింది. వెంటనే పనిలోకి దిగింది. తన ఇంటి గోడలకు ఉండే చెక్కలను ఊడదీసి.. మధ్యలో తెనెటీగలతో నింపింది. మధ్య మధ్యలో తేనెను తీస్తుంటుంది. అయినా ఈగలు మాత్రం ఎక్కడికీ వెళ్లవు. అక్కడే ఉంటూ మళ్లీ తెనెను ఉత్పత్తి చేస్తుంటాయి. రాణి తేనెటీగను కనిపెట్టడంలో ఈ యువతి దిట్ట. తేనె తీసిన తర్వాత.. రాణి ఈగను తీసుకుని మరో చోటికి మారుస్తుంది. అప్పుడు మిగతా ఈగలన్నీ దాని చుట్టూ చేరి.. తెనెను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇలా ఈ యువతి బయటికి వెళ్లకుండా తన ఇంటినే తేనె కేంద్రంగా మార్చుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. యువతిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2021-11-12T02:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising