ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి ఓ భార్య చేసిన నిర్వాకమిది.. తన అకౌంట్‌ నుంచి ఉన్న మెసేజ్‌లను చూసి షాక్.. చివరకు..!

ABN, First Publish Date - 2021-10-31T01:30:58+05:30

హర్యానాలోని పానిపట్ నగర పరిధి మోడల్‌ టౌన్‌లోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన మృదుల్‌ బజాజ్‌.. ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో పని చేస్తుంటాడు. 2020 నవంబర్‌లో ఢిల్లీకి చెందిన సోనియా బాత్రాను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు సంసారం బాగా నడిచింది.

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైవావిక జీవితం సవ్యంగా సాగాలంటే.. దంపతుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. అలాంటి వారు ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోతూ.. సంసార జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే కొన్ని బంధాలు మాత్రం.. కేవలం డబ్బుతో ముడిపడి ఉంటాయి. పైకి ప్రేమ నటిస్తూ లోపల కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు మగవారు ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. హర్యానాలో మాత్రం ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. తన భర్త ఫేస్‌బుక్ ఖాతానే హ్యాక్ చేసిన భార్య.. చివరకు ఏం చేసిందంటే..


హర్యానాలోని పానిపట్ నగర పరిధి మోడల్‌ టౌన్‌లోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన మృదుల్‌ బజాజ్‌.. ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో పని చేస్తుంటాడు. 2020 నవంబర్‌లో ఢిల్లీకి చెందిన సోనియా బాత్రాను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు సంసారం బాగా నడిచింది. తర్వాత కావాలని భర్తతో గొడవలు పెట్టుకునేది. అత్త,మామల నుంచి వెళ్లిపోయి దూరంగా ఉందామంటూ భర్తతో గొడవ చేసేది. ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో 2021లో విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల సోనియా బాత్రా.. తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోనే ఉంటోంది.


ఈ క్రమంలో తన ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి తన భార్య అకౌంట్‌కు మెసేజ్‌లు వెళ్లడాన్ని మృదుల్ గుర్తించాడు. తనకు అదనపు కట్నం కావాలని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తూ మెసేజ్‌లు వెళ్లడం చూసి షాక్ అయ్యాడు. తన ప్రమేయం లేకుండా తన అకౌంట్ నుంచి మెసేజ్‌లు ఎలా వెళ్తున్నాయో అతడికి అర్థం కాలేదు. కొన్నాళ్లు చూసి తర్వాత సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.


తన న్యాయవాది, సోదరుడు జై బత్రాతో కలిసి భర్త ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా భర్తను బెదిరించి, కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు తేలింది. అంతటితో ఆగకుండా భర్త ఇంట్లోని నగలు, నగదును కూడా ఎత్తుకెళ్లినట్లు గుర్తించి అంతా షాక్ అయ్యారు. మృదుల్‌ బజాజ్, అతడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-10-31T01:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising