ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై మీరు సీబీఐ, సీఐడీ అనేటప్పుడు ఈ తేడాలు తెలుసుకోండి.. లేదంటే ఎదుటివారికి కన్ఫ్యూజన్!

ABN, First Publish Date - 2021-12-19T17:48:38+05:30

రేడియోలో వార్తలు వినేవారు, టీవీలో వార్తలను చూసేవారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేడియోలో వార్తలు వినేవారు, టీవీలో వార్తలను చూసేవారు, లేదా వార్తాపత్రికలను తరగేసేవారు ఎప్పుడో ఒకప్పుడు సీఐడీ, సీబీఐ అనే పదాలను వినేవుంటారు. లేదా చదివేవుంటారు. కానీ ఆ సంస్థల గురించి చాలామందికి సంపూర్ణంగా తెలియదు. దీంతో సీబీఐకి, సీఐడీకి తేడా ఏమిటో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటిమధ్యగల తేడాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా సంచలన సంఘటన జరిగినప్పుడు సీబీఐతో విచారణ జరిపించాలనో లేదా సీఐడీ చేత విచారణ జరిపించాలనో పలువురు డిమాండ్‌ చేస్తుండటం చూస్తుంటాం. దీని ద్వారా సీబీఐ, సీఐడీ అనేవి రెండూ క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించిన దర్యాప్తు సంస్థలని మనకు ముందుగా అర్థం అవుతుంది. 




ఇప్పుడు సీబీఐ, సీఐడీ మధ్య తేడా ఏమిటో క్లియర్‌గా తెలుసుకుందాం.  సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సీఐడీ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్.  సీఐడీ దర్యాప్తు సంస్థ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. సీబీఐ దర్యాప్తు సంస్థ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. సీబీఐ  దర్యాప్తు సంస్థ మన దేశంలో చోటుచేసుకునే హత్యలు, కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలు, విదేశాలలో మన జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన క్రిమినల్ కేసుల కేసుల దర్యాప్తును చేపడుతుంది. ఇందుకోసం అవసరమైతే విదేశాలకు కూడా వెళ్తుంది. సీఐడీ దర్యాప్తు సంస్థ.. దొంగతనాలు, అల్లర్లు, హత్యలు, కిడ్నాప్ కేసులను దర్యాప్తు చేస్తుంది. నేర సంబంధిత కేసులు సీఐడీ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి కేసుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయస్థానం సీఐడీకి అప్పగిస్తుంది. సీబీఐ పరిధిలోకి వచ్చే నేరాలకు సంబంధించిన కేసులను, వాటి దర్యాప్తు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీం కోర్టులు ఆ సంస్థకు అప్పగిస్తాయి. సీఐడీ దర్యాప్తు సంస్థలో ఉద్యోగం సంపాదించాలనుకునేవారు ముందుగా పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించాలి. ఆ తరువాత సీఐడీ అధికారి అయ్యేందుకు అవకాశం ఏర్పుతుంది. సీబీఐ దర్యాప్తు సంస్థలో ఉద్యోగిగా చేరడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. దేశంలో 1902లో సీఐడీ ఏర్పాటు కాగా, సీబీఐని 1941లో నెలకొల్పారు.

Updated Date - 2021-12-19T17:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising