ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

104 ప్రమాదాలు.. 1300 మంది మృతులు.. విమాన ప్రమాదాలు అక్కడే ఎందుకు ఎక్కువ..?

ABN, First Publish Date - 2021-12-09T00:48:35+05:30

విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకే ప్రాంతంలో ఏకంగా 104 ప్రమాదాలు జరగ్గా.. మొత్తం 1300 మంది మృతి చెందారనే విషయం చాలా మందికి తెలీదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెలీకాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, పలువురు అధికారులు మృతి చెందడంపై.. దేశ వ్యాప్తంగా విషాధచాయలు అలుముకున్నాయి. గతంలో హెలీకాప్టర్ ప్రమాదాల్లో చాలా మంది ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు దుర్మరణం చెందిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం బిపిన్ రావత్ మృతిచెందడంతో హెలీకాప్టర్ ప్రమాదాలపై మరోసారి చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకే ప్రాంతంలో ఏకంగా 104 ప్రమాదాలు జరగ్గా.. మొత్తం 1300 మంది మృతి చెందారనే విషయం చాలా మందికి తెలీదు. ఆ ప్రదేశం ఎక్కడ, అక్కడే ఎందుకు అన్ని ప్రమాదాలు జరిగాయి.. అనే వివరాల్లోకి వెళితే..


ఆసియాలో మొత్తంలో జరిగిన విమాన ప్రమాదాలను పరిశీలిస్తే.. ఇండోనేషియాలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. 1945 నుంచి ఇప్పటిదాకా.. ఇండోనేషియాలోనే జరిగిన ప్రమాదాలు ఎక్కడా జరగలేదు. ఆర్థిక, సామాజిక, భౌగోళిక కారణాలతోనే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయట. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, సాంకేతిక, సామర్థ్య లోపం తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. ఇటీవల 62మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. ఇండోనేషియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే.


విమానయాన అధికారుల అశ్రద్ధ వల్లే ఇండోనేషియాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసింది. వైమానిక భద్రతా నెట్‌వర్క్‌ గణాంకాల ఆధారంగా 1945 నుంచి ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల్లో 13,00 మంది పౌరులు మరణించారు. ఈ కారణంగా ఇండోనేషియా విమానాలకు పలు దేశాలు అనుమతిని నిరాకరించాయి. 2007 నుంచి 2016 వరకు అమెరికాలోనూ, 2007 నుంచి 2018 వరకు యూరోపియన్‌ యూనియన్‌లోనూ ఇండోనేషియా విమానాలను రద్దు చేశారు. అయితే ప్రస్తుతం విమాన రంగంలో సమూల మార్పులు చేసేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారట. ఇందులో భాగంగా తరచూ విమానాల పనితీరుని పర్యవేక్షించడం, పైలెట్లకు మెరుగైన శిక్షణ తదితర అంశాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారని అక్కడి ప్రధాన మీడియా సమాచారం ప్రకారం తెలుస్తోంది.

Bipin Rawat.. బయో వార్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన మరుసటి రోజే దారుణ ఘటన..!

Updated Date - 2021-12-09T00:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising