ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది పురుషులు వాడే వస్తువు... 120 ఏళ్లు దాటినా దాని డిజైన్ మారలేదు.. ఎందుకలా ఉందో తెలిస్తే నోరెళ్లబెడతారు!

ABN, First Publish Date - 2021-12-19T16:37:45+05:30

బ్లేడ్‌లను తయారు చేసే కంపెనీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్లేడ్‌లను తయారు చేసే కంపెనీలు భారతదేశంలో చాలా ఉన్నాయి. బ్లేడ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సాధారణంగా బ్లేడ్‌ను షేవింగ్ మొదలకొని హెయిర్ కటింగ్ వరకు వినియోగిస్తారు. బ్లేడ్‌ను పరిశీలిస్తే దాని మధ్యలో ఒక ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. బ్లేడ్ల‌కు రూపకల్పన జరిగిన 120 ఏళ్ల తరువాత కూడా ఈ డిజైన్ మారకపోవడం విశేషం. తొలుత బ్లేడ్‌లను జిల్లెట్ సంస్థ తయారు చేయడం ప్రారంభించింది. మరి బ్లేడ్‌లోని ఆ డిజైన్ ఇప్పటికీ ఎందుకు అలానే ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మీడియాకు అందిన కథనాల ప్రకారం 1901లో జిల్లెట్ కంపెనీ వ్యవస్థాపకుడు కింగ్ క్యాంప్ తన సహచరులలో ఒకరైన బిలియం నికర్సన్‌తో కలిసి బ్లేడ్‌కు డిజైన్ చేశారు. 


బ్లేడ్‌కు అప్పటి నుంచి ఇదే డిజైన్ కొనసాగుతోంది. రేజర్‌లోని బోల్ట్‌లలో బ్లేడ్‌ను అమర్చాలి. దీనికి అనుగుణంగా ఈ ప్రత్యేక డిజైన్ చేశారు. 1904వ సంవత్సరంలో జిల్లెట్ కంపెనీ తొలిసారిగా 165 బ్లేడ్‌లను తయారు చేసింది. ఆ తరువాత బ్లేడ్‌లను తయారు చేసేందుకు మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ కంపెనీలన్నీ జిల్లెట్ కంపెనీ బ్లేడ్ డిజైన్‌ను కాపీ కొట్టాయి. అయితే కొత్త కంపెనీలకు అప్పట్లో ఒక సమస్య తలెత్తింది. అప్పట్లో జిల్లెట్ కంపెనీకి చెందిన రేజర్లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి. దీంతో ఆయా బేడ్ల కంపెనీలు జిల్లెట్ బ్లేడ్ డిజైన్‌ను కొనసాగించాల్సివచ్చింది. ఫలితంగా అప్పటి నుంచి బ్లేడ్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 

Updated Date - 2021-12-19T16:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising