ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్కా కోసం గొడవ.. మాట మాట పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు.. చివరికి ఘోరం

ABN, First Publish Date - 2021-10-27T12:35:44+05:30

కొన్నిసార్లు చిన్న విషయాల వల్ల కూడా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక గొడవ ఢిల్లీలో జరిగింది. కేవలం ఒక గుట్కా కోసం మొదలైన గొడవ హత్య వరకు వెళ్లింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. అసలు గొడవ ఎలా మొదలైందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు చిన్న విషయాల వల్ల కూడా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక గొడవ ఢిల్లీలో జరిగింది. కేవలం ఒక గుట్కా కోసం మొదలైన గొడవ హత్య వరకు వెళ్లింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. అసలు గొడవ ఎలా మొదలైందంటే..


ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన నరసింగ్ అదే ప్రాంతంలో ఒక పాన్‌షాపు నడుపుతున్నాడు.  ఒకరోజు నరసింగ్ షాపులో ఉండగా తన సోదరుడి కుమారుడు హేమంత్ అక్కడికి వచ్చాడు. హేమంత్‌తో పాటు అతని స్నేహితుడు కూడా వచ్చాడు. వారిద్దరూ నరసింహ్ షాపు వద్ద పాన్ తీసుకుందామని వచ్చారు. అక్కడే కాసేపు మాటల్లో ఉండగా.. షోయెబ్, సోహైల్ అనే ఇద్దరు వ్యక్తులు గుట్కా కోసం వచ్చారు. అప్పుడే హేమంత్ స్నేహితుడు తనకూ ఒక గుట్కా కావాలని అడిగాడు. దీంతో నరసింగ్ ముందుగా హేమంగ్ స్నేహితుడికి ఒక గుట్కా ఇచ్చాడు. కానీ అదే షాపులో చివరి గుట్కా ప్యాకెట్. స్టాక్ అయిపోయింది.


అది చూసిన షోయెబ్.. ముందు తాను గుట్కా అడిగితే మరొకరికి ఇవ్వడమేంటని.. నరసింగ్‌ని తిడుతూ మాట్లాడాడు. దీంతో హేమంత్ కలుగజేసుకొని తన బాబాయ్‌ని మరోమాట అలా అంటే బాగుండదని, అక్కడి నుంచి ముందు బయలుదేరమని కోపంగా మాట్లాడాడు. హేమంత్‌ అన్న మాటలకు షోయెబ్ తన స్నేహితుడు సోహైల్‌తో కలిసి దాడికి దిగాడు. గొడవ పెద్దది కావడంతో నరసింగ్ కూడా దిగాడు. షోయెబ్‌ని చితకబాది అక్కడి నుంచి పంపించాడు. కానీ గొడవ అంతటితో ఆగిపోలేదు.


కాసేపు తరువాత షోయెబ్, సోహైల్ కొంత మందిని వెంట వేసుకొని వచ్చి పాన్ షాపుపై దాడి చేశారు. ఈ దాడిలో నరసింగ్ తన షాపులోని కత్తెరను తీసుకొని షోయెబ్, సోహైల్‌పై దాడి చేశాడు. షోయెబ్‌కు ఆ కత్తెర ఛాతీలో దిగింది. సోహైల్‌కు వీపులో గుచ్చుకుంది. వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లగా షోయెబ్ అప్పటికే మరిణించాడని డాక్టర్లు చెప్పారు. సోహైల్ పరిస్థితి కూడా విషయంగా ఉంది.

పోలీసులు నరసింగ్, హేమంత్‌పై హత్య, హత్యా ప్రయత్నం కింద కేసులు నమోదు చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-27T12:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising