ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓం జై జ‌గ‌దీశ హ‌రే... హార‌తి పాట రాసింది ఎవ‌రో తెలుసా?

ABN, First Publish Date - 2021-06-24T15:12:19+05:30

మ‌న దేశంలో ఓం జై జగదీశ‌ హరే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మ‌న దేశంలో ఓం జై జగదీశ‌ హరే అనే హార‌తి పాట వినిపించ‌ని ఆల‌యం అంటూవుండ‌దు. చాలా సరళమైన, తేలికైన, మధురమైన పదాలతో ఈ పాట ఎంతో శ్రావ్యంగా వినిపిస్తుంటుంది. ఈపాట తొలిసారిగా బాలీవుడ్ చిత్ర దర్శకుడు, న‌టుడు మనోజ్ కుమార్ సినిమాలో వినిపించింది. తరువాతి కాలంలో ఈ పాట ఎంతో ఆద‌ర‌ణ‌పొందింది. ఈ పాట స్వరకర్త పండిట్ శ్రద్ధారామ్ శర్మ. 


చివ‌రి రోజుల్లో ఆయ‌న పాకిస్తాన్‌లోని లాహోర్ (అప్పటి భారతదేశం) లో (జూన్ 24న‌) ఆయన క‌న్నుమూశారు. హార‌తి పాట‌ రచయిత పండిట్ శ్రద్ధారామ్ శర్మ1837 వ సంవత్సరంలో పంజాబ్‌లోని లూధియానా సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఫిల్లౌరి అనే ఈ గ్రామం దాదాపు అనామకంగా ఉండేది. చిన్న వయస్సులోనే హిందూమ‌తంపై శ‌ర్మ అమిత‌మైన ప్రేమ చూపించేవారు. అనేక మత గ్రంథాలను అధ్య‌య‌నం చేశారు. గ్రామాల్లో జరిగే మతపరమైన ఉత్సవాల్లో పెద్దల మధ్య కూర్చుని, ప‌లు ఆధ్యాత్మిక విష‌యాలు చ‌ర్చించేవారు. అవి బ్రిటిష్ వారు ప‌రిపాలిస్తున్న రోజులు. ఆ స‌మ‌యంలో దేశ ప్రజలు బ్రిటీష‌ర్ల‌ను వ్య‌తిరేకించేవారు. పండిట్ శ్రద్ధారామ్ శర్మ కూడా బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌సంగాలు చేసేవారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న ఓం జై జ‌గ‌దీశ‌హ‌రే అనే హార‌తి పాట రాశారు. ఈ పాట ఎంతో మ‌ధురంగా ఉండ‌టంతో ద‌శాబ్ధ‌కాలంలోనే దేశంలోని ఇంటింటికీ పాకిపోయింది. 1870 సంవత్సరంలో ఈ పాట రాసిన‌పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలు. ఈ పాట తొలుత హిందీ సినిమా  పూర‌బ్ ఔర్ ప‌శ్చిమ్ సినిమాలో అల‌రించింది. అది  మొద‌లు ఈ పాట ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానుతూ వ‌చ్చింది. ప్రస్తుతం ఈ పాట తెలియ‌ని హిందువు అంటూ ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. 

Updated Date - 2021-06-24T15:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising