ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజూ గుడ్డు తింటే మీకు ఆ ప్రమాదం పొంచిఉన్నట్లే .. హెచ్చరిస్తున్న పరిశోధకులు

ABN, First Publish Date - 2021-12-30T09:39:08+05:30

ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తినే ఆహారం గుడ్డు. ఇప్పటివరకు రోజూ గుడ్డు తినమనే ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఒక్కసారిగా అలా చేయకూడదని హెచ్చరిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తినే ఆహారం గుడ్డు. ఇప్పటివరకు రోజూ గుడ్డు తినమనే ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఒక్కసారిగా అలా చేయకూడదని హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. తాజాగా జరిగిన ఒక పరిశోధనలో గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది.

రోజు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినేవారికి మధుమేహం ప్రమాదం 60 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువని తేలింది.


యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతర్ యూనివర్సిటీ సంయుక్తంగా 18 ఏళ్ల పాటు(1991 నుంచి 2009 వరకు) ఒక అధ్యయనం చేశాయి. అధ్యయన ఫలితాల్లో టైప్-2 మధుమేహం కేసులు రోజురోజుకు పెరుగుతుండటానికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పరిశోధకుడు మింగ్ లీ తెలిపారు.  చైనా ప్రజలు అతిగా గుడ్లను ఆహారంగా తీసుకోవడంతో వారిపై ఈ పరిశోధన చేశారు. డ్రాగన్ దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా ఫాస్ట్ ఫుడ్స్ తినేవారు బాగా ఎక్కువయ్యారు. అధిక శాతం ప్రజలు సంప్రదాయ ఆహారమైన ధాన్యాలు, కూరగాయలు తినడం లేదు. దీంతో వారిలో మధుమేహం బారిన పడ్డ వారు ఎక్కువగా ఉన్నారు. 


ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో గుడ్లను అతిగా వినియోగించడం వల్ల టైప్-2 డయాబెటీస్ పేషంట్స్  సంఖ్య గత 18 సంవత్సరల్లో క్రమంగా పెరిగిందని అధ్యయనంలో తేలింది.  రోజూ 38-50 గ్రాముల మధ్యలో గుడ్లను ఆహారంగా తీసుకుంటే మధుమేహం ప్రమాదం 25 శాతం ఉంటుందని.. అలాగే రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువగా గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే రిస్క్ 60 శాతం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

ఈ అధ్యయనంలో 50 ఏళ్లు వయసున్న వారు 8,545 మంది పాల్గొన్నారని డాక్టర్ మింగ్ లీ చెప్పారు. 

గుడ్లను తినాలంటే వాటిని ఉడకబెట్టి తినడమే సరైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.


Updated Date - 2021-12-30T09:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising