ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకు ఖాతా నుంచి రూ.73 లక్షలు చోరీ.. 34 ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్

ABN, First Publish Date - 2021-12-23T06:20:39+05:30

ఒక డాక్టర్‌కు చెందిన రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ అయిందని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక డాక్టర్‌కు  చెందిన రెండు బ్యాంకు అకౌంట్ల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ అయిందని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆ 34 ఖాతాదారుల గురించి వివారాలు సేకరిస్తున్నారు.


ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో నివసిస్తున్న డాక్టర్ అరుణ్ కుమార్‌కు ఒక రోజు ఫోన్‌లో మెసేజ్ వచ్చింది. అందులో అతని బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవుతున్నట్లు ఉండడంతో అరుణ్ కుమార్ కంగారు పడ్డాడు. మెసేజ్‌లో ‘వివరాల కోసం ఒక ఫోన్ నెంబర్‌ని సంప్రదించండి’ అని కూడా ఉండడంతో.. అరుణ్ కుమార్ ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా.. అవతల వ్యక్తి బ్యాంకు ఉద్యోగిగా పలకరించాడు.


బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఏవో ఆప్షన్లు తీసుకోవాలని చెప్పి ఆ వ్యక్తి నమ్మించాడు. అదంతా అరుణ్ కుమార్‌కు అర్థం కాకపోవడంతో ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేస్తే తానే అదంతా చేస్తానని చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ తన ఫోన్ స్క్రీన్ షేర్ చేశాడు. ఇదే అదునుగా ఆ వ్యక్తి అరుణ్ కుమార్ ఖాతా వివరాలు, ఫోన్ డేటా మొత్తం తీసేసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపట్లో అరుణ్ కుమార్‌కు అతని రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.73 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అది చదివి ఆందోళన చెందిన అరుణ్ కుమార్ ఆ వ్యక్తికి మళ్లీ ఫోన్ చేయగా.. అతని నెంబర్ స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అరుణ్ కుమార్ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైం పోలీసులు ఆ డబ్బులు బీహార్‌కు చెందిన 34 అకౌంట్లలో ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఆ 34 అకౌంట్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసుని విచారణ చేస్తున్న ఒక పోలీస్ అధికారి మాట్లుడుతూ.. “ఆ 34 అకౌంట్లు నకిలీవి.. ఆ ఖాతాదారులకు కొంతడబ్బు ఆశచూపి అందులో నుంచి మోసగాళ్లు మొత్తం రూ.73 లక్షలు తీసేసుకున్నారు. ప్రస్తుతం ఆ 34 ఖాతాదారులలో కొంతమంది ప్రశ్నిస్తున్నాం. వారిని మోసగాళ్లు ఎలా సంప్రదించారో తెలిస్తే ఆ దొంగలను పట్టుకోవచ్చు” అని వివరించారు.


Updated Date - 2021-12-23T06:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising