ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ అడవిలో చెట్లపై ఈత కొట్టొచ్చు.. అవును మీరు విన్నది నిజమే..!

ABN, First Publish Date - 2021-06-13T14:39:47+05:30

అడవులు మనకు ఎంత అవసరమో తెలిసిందే. అవి లేకపోతే ఈ భూమ్మీద మనం బతకలేం. ఈ భూమికి ఊపిరితిత్తులు అడవులే. ఈ అడవులు కేవలం ఆక్సిజన్ అందించడానికే ఉపయోగపడతాయని అనుకుంటే పొరబాటే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవులు మనకు ఎంత అవసరమో తెలిసిందే. అవి లేకపోతే ఈ భూమ్మీద మనం బతకలేం. ఈ భూమికి ఊపిరితిత్తులు అడవులే. ఈ అడవులు కేవలం ఆక్సిజన్ అందించడానికే ఉపయోగపడతాయని అనుకుంటే పొరబాటే. మనకు ఇప్పటి వరకూ తెలియని ఎన్నో రకాల జీవరాశులకు అడవులు ఆలవాలం. అమెజాన్ వంటి అడవుల్లోకి వెళ్లేకొద్దీ కొత్త జీవులు మన కంటపడుతూనే ఉంటాయి. అయితే అసలు అడవే ఒక వింతైన ప్రాంతం ఉంది తెలుసా? అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న ఈ అడవిని చూసేందుకు ప్రపంచ పర్యాటకులు అందరూ క్యూలు కడుతుంటారు. ఎందుకంటే ఈ అడవి అన్ని అడవుల్లా నేలపై లేదు, ఒక సరస్సు కింద ఉంది. అంటే ఆ సరస్సులో ఈత కొట్టాలంటే చెట్లపైనే ఈదాలన్నమాట.


అగ్రరాజ్యం అమెరికాలో ఓరెగాన్ రాష్ట్రం. ఇక్కడ మెకెంజీ నది చాలా పాపులర్. ఇక్కడి అందాలు చూడటానికి చాలా మంది పోటీ పడుతుంటారు. అయితే దీనికి చాలా దగ్గరలో మరో అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే క్లియర్ లేక్. ఈ సరస్సు అందాలు కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ సరస్సులో ఉన్న మరో విశేషం ఏంటంటే.. దీని కింద ఒక భారీ అడవి ఉంది. నిజమేనండీ.. ఈ సరస్సు నీళ్లలో ఈ అడవి ఉంది. దీనిలో కొన్ని చెట్లు 80 అడుగుల ఎత్తు వరకూ పెరిగి ఉంటాయి. అంటే మనం ఈ సరస్సులో పడవలో వెళ్తున్నా, ఈతకొడుతున్నా ఆ చెట్ల పైభాగం మనకు స్పష్టంగా కనిపిస్తూ కొత్త అనుభూతిని అందిస్తాయి. పురాతన కాలంలో ఒక అడవి ఇలా భూమిలోకి వెళ్లిపోయిందని స్థానికులు చెప్తారు.




చూడటానికి చాలా స్పష్టంగా ఉండే ఈ సరస్సు నీటిలో ఆ పురాతన అడవి అందాలు ఊపిరితీసుకోవడం మర్చిపోయేలా చేస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా డైవింగ్ చేసేవారికి ఈ సరస్సు స్వర్గధామం. సరస్సులో ఊగుతూ కనిపించే చెట్లు, వాటిలో గూళ్లు కట్టుకొని ఉండే జీవరాశి, వింత వింత మొక్కలు వారి ఆసక్తిని మరో మెట్టు పైకి తీసుకెళ్తాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడ డైవింగ్ చేసినా రాని వింత అనుభూతి ఇక్కడ దొరుకుతుందని కొందరు డైవర్లు చెప్తారు. డైవింగ్ చేయడం కోసం నీటిలో దూకి నీళ్లలోని అడవిలోకి కనీసం 100 అడుగులు వెళ్లి పైకి చూసినా కూడా చాలా స్పష్టంగా నీటిపైభాగం కనబడుతుంది. ఆ నీళ్లలో నెమ్మదిగా ఊగిసలాడే చెట్ల సందుల నుంచి ఆకాశాన్ని చూస్తే ఆ కిక్కే వేరట.


చల్లగా ఉండే ఈ సరస్సు నీటిలో ఎక్కువగా సీజనల్ డైవర్లే సాహసాలు చేస్తుంటారు. సామాన్యులు కూడా నీటిపై నుంచి మరో రకం అందాలను చూడొచ్చు. అయితే ఈ సరస్సులో మోటారు బోట్లు నడపడంపై నిషేధం ఉంది. కానీ కాయాకింగ్, స్టాండప్ పెడలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌కు అనుమతులు ఉన్నాయి. 



Updated Date - 2021-06-13T14:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising