ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాన్ని పూడ్చిపెట్టిన 8 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్.. పోలీసులే శవాన్ని బయటకు తీసి..!

ABN, First Publish Date - 2021-10-14T11:31:18+05:30

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లలో ఇటీవల ఒక వింత సంఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తు తెలియని శవం దొరికింది. పోలీసులు దాన్ని ఒక అనాథ శవంగా పూడ్చి పెట్టారు. కానీ 8 రోజుల తరువాత మళ్లీ ఆ శవాన్నీ వెలికి తీయాల్సి వచ్చింది. అసలేం జరిగింగంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లలో ఇటీవల ఒక వింత సంఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తు తెలియని శవం దొరికింది. పోలీసులు దాన్ని ఒక అనాథ శవంగా పూడ్చి పెట్టారు. కానీ 8 రోజుల తరువాత మళ్లీ ఆ శవాన్నీ వెలికి తీయాల్సి వచ్చింది. అసలేం జరిగింగంటే..


సాగర్ జిల్లలోని బీనా నగరంలో అక్టోబర్ 4న రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తు తెలియని శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం చేసేందకు పంపించారు. శవం ముఖం పూర్తిగా దెబ్బతినడంతో దాని గుర్తింపు కుదరలేదు. ఆ శవం ఒక 40 ఏళ్లు పైబడిన వ్యక్తిదిగా తెలిసింది. మూడు రోజులు చూసి శవం కోసం ఎవరూ రాకపోయేసరికి పోలీసులే శవాన్ని అంతక్రియలు చేసి పూడ్చిపెట్టారు.


మరోవైపు బీనా నగరానికి చెందిన సోహన్‌లాల్(50) అనే వ్యక్తి సెప్టెంబర్ 29న ఇంటి నుంచి ఉదయం 10 బయలుదేరి తిరిగి రాలేదు. ఒకరోజు తరువాత కుటుంబసభ్యులు అతని కోసం ఆందోళన చెంది. బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి అడిగారు. కానీ అక్కడికి రాలేదని తెలిసింది. రెండు రోజుల తరువాత అక్టోబర్ 1న దెగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో సోహన్‌లాల్ కనుబడుట లేదని అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.


పదిరోజుల తరువాత రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని 40 ఏళ్ల వ్యక్తి శవం దొరికిందని సోహన్‌లాల్ కుటుంబానికి పోలీసులు తెలియజేశారు. సోహన్‌లాల్ కుమారుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా.. అది బజరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని తెలిసింది. అతను బజరియా పోలీస్ స్టేషన్ చేరుకొని తన తండ్రి మిస్సింగ్ కేస్ గురించి చెప్పాడు. వారు శవం దొరికిన మాట నిజమే కానీ అప్పటికే దాన్ని పూడ్చి పెట్టి 8 రోజులవుతోందని చెప్పారు. 


శవానికి సంబంధించిన బట్టలు, చెప్పులని పోలీసులు చూపించారు. అవి తండ్రి సోహన్‌లాల్‌కు చెందనవిగా అతను గుర్తించి బాధతో ఏడ్చాడు. ఆ తరువాత సోహన్‌లాల్‌ శవం తనకు కావాలని అన్నాడు. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. తప్పనిసరిగా శవం సమాధి నుంచి వెలికితీయడానికి పోలీసులు అన్ని అనుమతులు తీసుకొన్నారు. ఆ తరువాత మళ్లీ శవాన్ని సమాధి నుంచి వెలికితీసి సోహన్‌లాల్ కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - 2021-10-14T11:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising