ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో పెనుమార్పులు తెస్తున్న ‘కరోనా’..!

ABN, First Publish Date - 2021-05-14T23:56:33+05:30

కరోనా మొదటగా బయటపడినప్పుడు వయోవృద్ధులు, మధ్య వయసు వారు ప్రాణాలను హరించింది. ఇక రెండో వేవ్‌లో యువకులే లక్ష్యంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇంకా దీని నుంచి బయటపడకముందే.. థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మొదటగా బయటపడినప్పుడు వయోవృద్ధులు, మధ్య వయసు వారు ప్రాణాలను హరించింది. ఇక రెండో వేవ్‌లో యువకులే లక్ష్యంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇంకా దీని నుంచి బయటపడకముందే.. థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు  పెద్దలనే బలి తీసుకున్న ఈ మహమ్మారి థర్డ్ వేవ్‌లో ముక్కుపచ్చలారని పిల్లలపై దాడి చేసే అవకశం ఉందని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.  తల్లిదండ్రులు పిల్లల స్వేచ్ఛ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పిల్లలపై మానసికంగా తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. కొత్త ఆంక్షలతో వారి పసి మనసులు కృంగిపోతున్నాయి. దీంతో ఇప్పటికే అనేకమంది పిల్లల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


కరోనా పరిస్థితులు, తల్లిదండ్రుల ఆంక్షలు వెరసి పిల్లల ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోందని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిన పిల్లలు  మానసిక రుగ్మతలకు లోనై దుందుడుకు తనం, హింసాత్మక స్వభావాలు పెరుగుతున్నాయని, ఇవి తల్లిందండ్రులకు భవిష్యత్తులో కొత్త ఇబ్బందులు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా స్పందించడం, తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకోవడం ఇలాంటి సమస్యలన్నీ చిన్నపిల్లల్లో కనపడతాయని సూచిస్తున్నారు.


ఈ సమస్యలపై సైకాలజిస్టు సత్యకాంత్‌ త్రివేది అనేక విషయాలను వివరించారు. ‘‘తాజా పరిస్థితుల వల్ల పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులు తల్లిదండ్రులకు సమస్యే. ఎందుకంటే వారి పిల్లలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో తమ పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు నా వద్దకు రావటం పెరిగిపోయింది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాల’ని అన్నారు.


ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులల్లో చదువుకుంటూ, మిగతా సమయాల్లో టీవీ, మొబైల్స్‌తో గడిపేస్తున్నారని, ఇది వారిని ఓ చట్రంలో బిగించిన ఫీలింగ్ కలిగిస్తుందని, దాంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ ప్రభావానని తగ్గించాలంటే పిల్లలతో తల్లిదండ్రులు గడపడమే ప్రధాన మార్గమని త్రివేది తెలిపారు. 


పిల్లలతో క్యారమ్స్‌, చెస్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌‌ ఆడడం, వారితో కలిసి ఎంజాయ్ చేయడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, రకరకాల టాపిక్స్‌ గురించి చర్చించడం, పాజిటివ్‌ విషయాల గురించి వారితో చర్చించడం చేస్తుండాలని సూచించారు. అయితే కరోనా పరిస్థితుల గురించి, ఇబ్బందుల గురించి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించకూడదని హెచ్చరించారు. పిల్లల మానసిక స్థితిని గాడిలో పెట్టాలంటే ప్రధానంగా తల్లిందండ్రులపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-14T23:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising