ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి చనిపోయిన తర్వాత ఆ బాలిక మేనమామ ఇంటికి వెళ్లింది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ చేసిన ఘోరంపై కోర్టు తీర్పు ఏంటంటే..

ABN, First Publish Date - 2021-12-02T20:38:21+05:30

చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో ఆ బాలిక అమ్మమ్మగారింటికి చేరింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో ఆ బాలిక అమ్మమ్మగారింటికి చేరింది.. తండ్రి ఉద్యోగ నిమిత్తం వేరే ఊరిలో ఉండడంతో మేనమామ సంరక్షణలో నిశ్చింతగా ఉందామనుకుంది.. అయితే కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ ఆ బాలికపై కన్నేశాడు.. ఇంట్లో ఎవరూ లేని రాత్రి సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. తండ్రికి విషయం తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తాజాగా ఈ ఘటనపై జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.. .


హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన బర్వాల గ్రామంలోని 17 ఏళ్ల బాలిక 2019లో తన తల్లిని కోల్పోయింది. తండ్రి వేరే ఊరిలో ఉద్యోగం చేస్తుండడంతో అమ్మమ్మ ఇంటికి చేరింది. అదే ఇంట్లో ఉంటున్న మేనమామ ఆమెపై కన్నేశాడు. 2019 జనవరి 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 


కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తండ్రికి అసలు విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రెండేళ్ల విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అతడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 

Updated Date - 2021-12-02T20:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising