ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నా: ఒక నర్సు అనుభవం!

ABN, First Publish Date - 2021-01-17T16:07:13+05:30

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో నర్సింగ్ అధికారిణి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో నర్సింగ్ అధికారిణి జోసిమా జలారమథికి శుక్రవారం రాత్రి ఫోన్ వచ్చింది. మర్నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ వేసే భాధ్యతలు  చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలనే ఆదేశాలు ఫోను ద్వారా ఆమెకు అందాయి. ఆ సమయంలో ఆమెకు కలిగిన అనుభవాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. తాను గత 21 ఏళ్లుగా నర్సుగా పనిచేస్తున్నానని, అయితే ఇప్పడు ఎదురైన అనుభవం ఎంతో భిన్నమైనదని తెలిపారు. 


ఇది నూతన వ్యాక్సినేషన్. అందుకే తెలియని ఆందోళన కలిగింది. దీంతో రాత్రంతా పడుకోలేకపోయాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జీ గురురాజ్ కు ఇచ్చాను. ఈ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు చేతులు వణుకుతున్నట్లు అనిపించింది. తరువాత మనసును స్థిమితపరచుకుంటూ, ధైర్యంగా వ్యవహరించాను. ఈ సమయంలో కొలీగ్స్ సాయం చేశారు. దీంతో ఇంజక్షన్లు ఇచ్చాను. వ్యాక్సిన్ షాట్ ఇచ్చే సమయంలో గతంలో ఆసుపత్రికి వచ్చిన కరోనా కేసులు గుర్తుకువచ్చాయి. ఆసుపత్రి సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఎన్నో మరణాలు కూడా చూశానని జోసిమా తెలిపారు. కాగా ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో జోసిమా మొత్తం 38 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.

Updated Date - 2021-01-17T16:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising