ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రోజుల్లో తాగి నడపడం పెద్ద తప్పేం కాదు.. మా వాడిని విడిచిపెట్టండి: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

ABN, First Publish Date - 2021-10-19T23:00:14+05:30

‘ఈ రోజుల్లో పిల్లలు తాగడం, బండి నడపడం పెద్ద తప్పేం కాదు. అందరూ చేస్తున్నది అదే, పిల్లలన్నాక తప్పులు చేస్తూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: ‘ఈ రోజుల్లో పిల్లలు తాగడం, బండి నడపడం పెద్ద తప్పేం కాదు. అందరూ చేస్తున్నది అదే, పిల్లలన్నాక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ మాత్రానికే డ్రంకెన్ డ్రైవ్ కింద అరెస్ట్ చేసేస్తారా? వెంటనే మా వాడిని వదిలిపెట్టండి’ అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లో ధర్నాకు దిగారు. జోధ్‌పూర్‌లోని షేర్‌గఢ్‌‌ పోలీస్ స్టేషన్‌లో వారు నేలపై కూర్చుని పోలీసులతో వాగ్వివాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎమ్మెల్యే మేనల్లుడిని కారును సీజ్ చేసిన పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించడమే ఈ మొత్తం రగడకు కారణం.  పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఎమ్మెల్యే, ఆమె భర్త.. ‘‘ఈ రోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అదేమంత పెద్ద విషయం కాదు. అతడిని విడుదల చేయమని నేను కోరుతున్నాను’’ అని ఎమ్మెల్యే అన్నారు.


అతడిని విడిచిపెట్టేందుకు పోలీసులు నిరాకరించడంతో తాను పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేస్తానని పోలీసులను ఆమె బెదిరించారు. ఆమె భర్త ఎవరెవరికో ఫోన్లు చేస్తూ కనిపించారు. ఈ మొత్తం ఘటనను ఓ పోలీసు అధికారి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సామరస్యంగా మాట్లాడుకుందామని పోలీసులు చెబుతున్నప్పటికీ ఉమైద్ సింగ్ మాత్రం ససేమిరా అన్నడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. 


అంతేకాదు, ‘‘నిన్ననే ఈ స్టేషన్ నుంచి కొందరు పోలీసులు సస్పెండైన విషయాన్ని మర్చిపోయారా?’’ అని ఉమైద్ సింగ్ పోలీసులను హెచ్చరించారు. డీసీపీ జోక్యం చేసుకోవడంతో సీజ్ చేసిన ఎమ్మెల్యే మేనల్లుడి కారును పోలీసులు తిరిగి అప్పగించారు.


ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మొత్తం ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే మీనా కున్వర్.. తన బంధువుల అబ్బాయిని విడిచిపెట్టమని పోలీసులను కోరారని, దీనికి వారు నిరాకరించారని అన్నారు. పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.



Updated Date - 2021-10-19T23:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising