ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పక్కన ఉండే మైలురాళ్లు వివిధ రంగులలో ఎందుకు ఉంటాయి? దీని వెనుకనున్న అర్థం ఏమిటో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-12-27T17:53:08+05:30

మనం దేశంలో ఎక్కడికైనా విహారయాత్రకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం దేశంలో ఎక్కడికైనా విహారయాత్రకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్డు పక్క వివిధ రంగుల మైలురాళ్లను చూసేవుంటాం. ఈ రాళ్లు రివర్స్‌లో ఉన్న U ఆకారంలో కనిపిస్తాయి. ఈ రాళ్ల పైభాగం ఆకుపచ్చ, పసుపు, నలుపు, ఆరెంజ్ రంగులలో ఉంటుంది. మైలురాయి దిగువ భాగం తెలుపు రంగులో ఉంటుంది. వీటిని గమనించినప్పుడు ఈ రాళ్ల పైభాగాలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయనే ప్రశ్న మన మనసులో మెదులుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 

గ్రీన్ కలర్ మైల్‌స్టోన్ 

రోడ్డు పక్కన ఉన్న మైలురాయిలో పైభాగం పచ్చగా, కింది భాగం తెల్లగా ఉంటే మీరు ప్రయాణిస్తున్నది జాతీయ రహదారి కాదని.. అది రాష్ట్ర రహదారి అని అర్థం. ఈ రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అయివుంటుంది.

పసుపు రంగు మైలురాయి

రోడ్డు పక్కన కనిపించే మైలురాయిలో పైభాగం పసుపు రంగులో, దిగువ భాగం తెలుపు రంగులో ఉంటే మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని, దీని పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూసుకుంటుందని అర్థం.


బ్లాక్ కలర్ మైల్‌స్టోన్ 

రోడ్డు పక్కన కనిపించే మైలురాయిలో పైభాగం నల్లగా, కింది భాగం తెల్లగా ఉంటే మీరు ఏదో ఒక మహా నగరం లేదా జిల్లా రహదారిపై ప్రయాణిస్తున్నట్లు గ్రహించాలి. ఈ రహదారి బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది. ఈ రహదారిలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, స్థానిక జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సంబంధిత రాష్ట్ర, జిల్లా అధికారులు సంయుక్తంగా ఈ రహదారికి మరమ్మతులు చేస్తారు. 

ఆరెంజ్ కలర్ మైల్‌స్టోన్ 

రోడ్డు పక్కన ఉన్న మైలురాయిలో పైభాగం ఆరెంజ్ రంగులో ఉండి, కింది భాగం తెలుపు రంగులో ఉంటే మీరు గ్రామీణ రహదారిపై ప్రయాణిస్తున్నట్టు అర్థం. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటువంటి రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లను నిర్వహించే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది.

Updated Date - 2021-12-27T17:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising