ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు కాఫీ ప్రియులా? అయితే మీకు ఈ అనారోగ్య సమస్య ఎదురుకాదు.. ఆశ్చర్యపరుస్తున్న ప్రయోగ ఫలితాలు!

ABN, First Publish Date - 2021-12-20T14:15:07+05:30

మీరు కాఫీ ప్రియులైతే ఈ శుభవార్త మీకోసమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు కాఫీ ప్రియులైతే ఈ శుభవార్త మీకోసమే.. సాధారణంగా వృద్ధాప్యంలో అందరికీ ఎదురయ్యే ఒక అనారోగ్య సమస్య.. రోజూ కాఫీ తాగేవారికి ఎదురుకాదట. కాఫీ తాగడంపై జరిపిన తాజా పరిశోధనల్లో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. కాఫీ తాగడం వలన అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందడం ఆలస్యం అవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనల ఫలితాలు జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆస్ట్రేలియాలోని ఎడిథ్ కోవాన్ యూనివర్సిటీ (ఈసీయూ) పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు. దశాబ్దం కాలంగా కాఫీ తాగుతున్న 200 మంది ఆస్ట్రేలియన్లపై ఈ పరిశోధనలు సాగించారు. కాఫీ తాగడం అనేది వారి అభిజ్ఞా క్షీణత(cognitive decline) రేటును ప్రభావితం చేస్తుందా? లేదా అనే దానిని పరిశీలించారు.


ఈ పరిశోధనా బృందంలోని ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ సామంథా గార్డనర్ ఈ అధ్యయనం ప్రారంభంలో.. రోజూ కాఫీతాగేవారిలో అభిజ్ఞా క్షీణత ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. మిగిలినవారితో పోలిస్తే కాఫీ ప్రియులలో జ్ఞాపకశక్తి కోల్పోయే ముప్పు తక్కువేనని పరిశోధనల్లో తేలింది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం మెదడులోని అమిలాయిడ్ ప్రొటీన్‌. దీనిని మందగింపజేసేందుకు కాఫీ తాగడానికి సంబంధం ఉన్నట్లు డాక్టర్ సామంథా గార్డనర్ గుర్తించారు. అయితే జ్ఞాపకశక్తి క్షీణతకు గురయ్యే ప్రమాదం ఉన్న వ్యక్తులు ఎంత మోతాదులో కాఫీ తాగాలి అనేదానిపై పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసిన కాఫీ 240 గ్రాములు అనుకుంటే.. రోజుకు రెండు కప్పులను తీసుకోవడం ద్వారా 18 నెలల తర్వాత జ్ఞాపకశక్తి క్షీణత ముప్పును 8 శాతం వరకూ తగ్గించవచ్చని పరిశోధనలలో తేలింది. అలాగే కాఫీ తాగడం ద్వారా.. మెదడులో అమిలాయిడ్ చేరికలో ఐదు శాతం తగ్గింపును కూడా పరిశోధకులు గుర్తించారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ గార్డనర్ తెలిపారు. కాగా పరిశోధకులకు ఈ అధ్యయనం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది, అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడానికి కాఫీ తాగడం సులువైన మార్గమనే సూచనలు అందాయి. అల్జీమర్స్ అనేది వృద్ధాప్యంలో వచ్చే వ్యాధి. ఈ స్థితిలో మనిషి జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మాట్లాడడంలో తడబాటు మొదలైనవి ఎదురవుతాయి.



Updated Date - 2021-12-20T14:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising