ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాము పగ.. ఇదో వింత కథ.. కళ్ల ముందే తన ‘నాగిని’ని తొక్కుకుంటూ వెళ్లిన కారును వెంబడించిన జంటనాగు.. రెండ్రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2021-10-21T15:42:42+05:30

పాములు పగ పడతాయన్న కథలను ఇప్పటి వరకూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములు పగ పడతాయన్న కథలను ఇప్పటి వరకూ పుస్తకాల్లోనూ, సినిమాల్లోనే చూసివుంటాం. అయితే యూపీలోని అజమ్‌గఢ్ జిల్లా, మెహ్నగర్‌లో ఒక ఆడనాగు మృతిచెందాక దాని జంట అయిన మగనాగు పోలీస్ స్టేషన్‌కు వచ్చి బుసలు కొడుతూ నానా హంగామా చేసింది. దీనిని స్థానికులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ తరువాత అతికష్టం మీద ఆ మగనాగును పట్టుకుని, అడవుల్లో వదిలివేశారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆడనాగు మృతితో కలతచెందిన మగనాగు ఎప్పటికైనా తిరిగివచ్చి తన జంటనాగును చంపిన వ్యక్తిని కాటువేస్తుందని స్థానికులు అంటున్నారు.


వారు తెలిపిన వివరాల ప్రకారం వారం రోజుల క్రితం మెహ్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుదారులతో రద్దీ ఏర్పడింది. ఈ సమయంలో అక్కడికి సమీపంలోకి నాగుపాముల జంట వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి పొరపాటుగా ఆడనాగు మీదుగా కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆ పాము అక్కడిక్కడే మృతి చెందింది. ఆ తరువాత మగనాగు ఆ కారును వెంబడించింది. అయితే జనం ఆ పాము ఎక్కడికో వెళ్లిపోయిందని, తిరిగిరాదని అనుకున్నారు. మృతి చెందిన ఆ ఆడనాగును అక్కడికి సమీపంలోనే ఖననం చేశారు. దీంతో కథ ముగిసిందని వారంతా అనుకున్నారు. అయితే రెండు రోజుల తరువాత ఆ మగనాగు మళ్లీ పోలీస్ స్టేషన్ సమీపంలో కనిపించింది. దీంతో ఆ నాగుపాము పగపట్టిందని, అందుకే తిరిగి ఇక్కడికి వచ్చిందని భావించారు. ఆ పామును గమనించిన పోలీసులు దానిని చంపేందుకు ప్రయత్నించారు. అయితే స్టేషన్ హెడ్ వారిని అడ్డుకుని, ఆ పాము డస్ట్‌బిన్‌లోకి చేరుకునేలా చేసి, దూరంగా ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లి వదిలివేశారు.

Updated Date - 2021-10-21T15:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising