ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్యాకుమారి లవంగాలకు GI Tag ఘనత

ABN, First Publish Date - 2021-10-09T18:31:02+05:30

కన్యాకుమారి కొండల్లో సాగు చేస్తున్న లవంగాలకు జీఐ ట్యాగ్ ఘనత దక్కింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్యాకుమారి(తమిళనాడు): కన్యాకుమారి కొండల్లో సాగు చేస్తున్న లవంగాలకు జీఐ ట్యాగ్ ఘనత దక్కింది. ఔషధ గుణాలున్న లవంగాలు కన్యాకుమారి జిల్లాలోని పశ్చిమ కనుమలలోని మరమలై, కరుంపరాయి, వెల్లిమలై కొండల్లో రైతులు పండిస్తున్నారు. తమిళనాడులో రైతులు 760 హెక్టార్ల విస్తీర్ణంలో లవంగాలు సాగు చేస్తున్నారని కన్యాకుమారి జిల్లా కలెక్టరు ఎం అరవింద్ చెప్పారు. దేశంలో 1100 మెట్రిక్ టన్నుల లవంగాల ఉత్పత్తిలో తమిళనాడు 1000 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో 750 మెట్రిక్ టన్నుల లవంగాలు ఒక్క కన్యాకుమారి నుంచే ఉత్పత్తి అవుతోంది. 


కన్యాకుమారి లవంగాలకు జీఐ ట్యాగ్ కోసం 8 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే ఎట్టకేలకు ఫలించిందని బ్లాక్‌రాక్ హిల్ ప్లాంటర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి లాలాజీ చెప్పారు.నూనె సాంద్రత ఎక్కువగా ఉన్న లవంగాలకు జీఐ ట్యాగ్ దక్కిందని రైతులు చెప్పారు. కొండ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం, సముద్రపు పొగమంచు వల్ల ఇక్కడ పండే లవంగాల్లో నూనె సాంద్రత పెరిగిందని మరమలై ప్లాంటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం సుబ్రహ్మణ్యం చెప్పారు. మందంగా ఉన్న లవంగాలను ఫార్మాస్యూటికల్, పెర్ఫ్యూమ్ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు.


Updated Date - 2021-10-09T18:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising