ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూళ్లో టీచర్ చేతిలో దెబ్బలు తిన్నాడు.. కోపంతో ఇంటికి వచ్చిన బాలుడు ఎంత పని చేశాడంటే..

ABN, First Publish Date - 2021-12-06T18:16:28+05:30

ఆ కుర్రాడు ప్రభుత్వోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడు ప్రభుత్వోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.. సరిగ్గా చదవడం లేదనే కారణంతో శనివారం ఆ కుర్రాడిని ఉపాధ్యాయుడు చితకబాదాడు.. రోజంతా ఎండలో నిల్చోబెట్టాడు.. ఆ అవమానాన్ని భరించలేకపోయిన బాలుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. కోపంగా ఇంటికి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ ఘటన జరిగింది. 


నాగౌర్‌లోని అకోడా గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శనివారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. బాలుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి, సోదరి అన్వేషణ ప్రారంభించారు. అతడి స్నేహితులను అడిగితే అసలు విషయం తెలిసింది. శనివారం ఉదయం స్కూళ్లో టీచర్ చేతిలో ఆ బాలుడు దారుణంగా దెబ్బలు తిన్నాడని, రోజంతా ఎండలో ఉన్నాడని, అందువల్లె ఇంటి నుంచి పారిపోయాడని తెలుసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రానికి ఆ బాలుడి ఆచూకీ దొరికింది. ఆ బాలుడు హర్యానా సరిహద్దులో పోలీసులకు దొరికాడు. ఓ ట్రక్ ఎక్కి ఆ బాలుడు అంత దూరం వెళ్లిపోయాడు. ఆచూకీ దొరకడంతో అకోడా పోలీసులు, ఆ బాలుడి మేనమామ హర్యానా సరిహద్దు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.  

Updated Date - 2021-12-06T18:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising