ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayodhya: జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ సంచలన హెచ్చరిక

ABN, First Publish Date - 2021-09-29T15:09:09+05:30

జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి, లేకుంటే నేను జల సమాధి చేసుకుంటాను...

న్యూఢిల్లీ:జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు.మహాత్మాగాంధీ జన్మదినం అయిన అక్టోబర్ 2వతేదీ నాటికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని చవానీకి చెందిన ప్రముఖ తపస్వీ జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తాను జల సమాధి చేసుకుంటానని మహారాజ్  బెదిరించారు.‘‘అక్టోబర్ 2వతేదీ లోపు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను, లేదంటే నేను సరయు నదిలో జల సమాధి చేసుకుంటాను’’ అని అయోధ్యలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ చెప్పారు.




భారతదేశంలోని ముస్లిములు, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని జగద్గురు పరమహంస డిమాండ్ చేశారు.పరమహంస ఆచార్య గతంలో 15 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి హామీ లభించిన తర్వాత ఆయన నిరాహార దీక్ష విరమించారు.జగద్దురు పరమహంస చేసిన డిమాండ్లకు మద్దతుగా హిందూ సనాతన ధర్మ సంసద్ నిర్వహిస్తామని అయోధ్యలోని సాధువు సంఘం తెలిపింది. 2022 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగద్దురు పరమహంస తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2021-09-29T15:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising