ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యేళ్ల నాటి పద్యంతో వేల కోట్లు నష్టపోయిన బిలియనీర్

ABN, First Publish Date - 2021-05-12T02:29:55+05:30

కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వేల కోట్ల నష్టం చవి చూడాల్సి వస్తుంది. తాజాగా చైనాకు చెందిన ఓ బిలియనీర్ ఇలాంటి పరిస్థితినే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వేల కోట్ల నష్టం చవి చూడాల్సి వస్తుంది. తాజాగా చైనాకు చెందిన ఓ బిలియనీర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఆయన చేసిన పొరపాటేంటో తెలుసా..? వెయ్యేళ్ల నాటి ప్రాచీన కవితను ట్విటర్‌లో షేర్ చేయడం. అవును చైనా చరిత్రకు సంబంధించిన ఈ కవిత 1100 ఏళ్లనాటిది. చైనా బిలియనీర్, మీట్యుయన్ సీఈవో వాంగ్ జింగ్ ఈ కవితలోని కొన్ని పంక్తులను తన తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో చైనా మొట్టమొదటి చక్రవర్తి తనకు వ్యతిరేకంగా రేగుతున్న అసమ్మతిని అణచడానికి చేసిన తప్పుడు ప్రయత్నాల గురించి పేర్కొనడం జరిగింది. దీంతో జింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని అనేక మంది భావించారు. దీంతో అతడు సీఈవోగా ఉన్న మీట్యుయన్ కంపెనీ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్ల(రూ.18,365 కోట్లు) మేర పడిపోయింది.


కాగా.. గతేడాది చైనా వ్యాపార దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా చైనా విధానాలను తప్పుబట్టాడు. దీంతో అతడిపై చైనా అనేక రకాలుగా ప్రతీకార చర్యలకు తెగబడింది. బిలియన్ డాలర్ల మేర జరిమానాలు విధించింది. అదే తరహాలో తమకు వ్యతిరేకంగా వచ్చిన మరికొంతమంది వ్యాపారులపై కూడా చైనా ప్రభుత్వం ఇలాంటి ధోరణులే అవలంబించిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జింగ్ ఈ కవితను షేర్ చేశాడనే అనుమానాలూ ఉన్నాయి. మరి ఇప్పుడు జింగ్‌పై కూడా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా అనే విషయం తెలియాలి.

Updated Date - 2021-05-12T02:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising