ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యభిచారం కేసులో దొరికిపోయిన చైనా Prince of piano

ABN, First Publish Date - 2021-10-22T22:12:23+05:30

ప్రిన్స్ ఆఫ్ పియానోగా పేరుగాంచి చైనాకు చెందిన లి యుండి వ్యభిచారం కేసులో గురువారం రాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ప్రిన్స్ ఆఫ్ పియానోగా పేరుగాంచిన చైనాకు చెందిన లి యుండి వ్యభిచారం కేసులో గురువారం రాత్రి పట్టుబడడం సంచలనమైంది. లి యుండి పట్టుబడినట్టు చావోయాంగ్ పోలీసులు చైనా సోషల్ మీడియా సినా వీబో ద్వారా తెలిపారు. ఇక్కడి నివాస ప్రాంతంలో ఓ వ్యక్తి.. మహిళను ఎంగేజ్ చేసుకున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు చెన్ అనే 29 ఏళ్ల మహిళను, 39 ఏళ్ల లిని అరెస్ట్ చేశారు. వారు తమ తప్పుడు ప్రవర్తనను అంగీకరించారని పోలీసులు తెలిపారు.  


పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. వ్యభిచారం కేసులో పట్టుబడిన ఆ వ్యక్తి మరెవరో కాదని, ప్రముఖ పియానిస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. 2000వ సంవత్సరంలో 18 ఏళ్ల వయసులోనే ఎక్స్ఐవీ ఇంటర్నేషనల్ చోపిన్ పియానో కాంటిపిటిషన్‌లో విజేతగా నిలిచాడని చెబుతున్నారు. అంతేకాదు, అదే పోటీకి అతడు 2015 వరకు జడ్జ్‌గా కూడా వ్యవహరించాడని అంటున్నారు. పోలీసులు తమ పోస్టులో పియానో కీ బోర్డును ఉపయోగించడంతో పట్టుబడింది ‘ప్రిన్స్ ఆఫ్ పియానో’ లి  యుండిగా నెటిజన్లు గుర్తించారు.   

Updated Date - 2021-10-22T22:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising