ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరెస్ట్ శిఖరం వద్ద ‘లైన్ ఆఫ్ సెపరేషన్’ పెట్టనున్న చైనా

ABN, First Publish Date - 2021-05-11T21:46:51+05:30

కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఎవరెస్ట్ శిఖరం వద్ద విభజన రేఖను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఎవరెస్ట్ శిఖరం వద్ద విభజన రేఖను ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయించింది. చైనా వైపు నుంచి, నేపాల్ వైపు నుంచి వచ్చేవారిని వేరు చేయడం కోసం ఈ రేఖను ఏర్పాటు చేయబోతోంది. టిబెటన్ మౌంటెనీరింగ్ గైడ్స్ బృందం ఈ రేఖను ఏర్పాటు చేస్తుంది. పర్వతారోహకులు ఇక్కడికి చేరుకోవడానికి ముందే ఈ ఏర్పాట్లు జరుగుతాయి. ఈ వివరాలను చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 


అయితే ఈ రేఖను ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నదీ స్పష్టత లేదు. ఎవరెస్టు శిఖరం ఉత్తరం వైపు నుంచి అంటే చైనా వైపు నుంచి వెళ్లేవారు, ఈ శిఖరం దక్షిణం వైపు నుంచి అంటే నేపాల్ వైపు నుంచి వెళ్లేవారు పరస్పరం కలవకుండా చర్యలు తీసుకుంటారు. 


గత ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా శిఖరారోహణను చైనా, నేపాల్ రద్దు చేశాయి. ఈ ఏడాది నేపాల్ 408 మంది విదేశీయులకు అనుమతి ఇచ్చింది. చైనా 21 మందికి అనుమతి ఇచ్చింది. కోవిడ్ కేసులు నేపాల్‌లో పెరుగుతుండటం, చైనాలో తగ్గుతుండటం వల్ల. శిఖరారోహకులు పరస్పరం కలవకుండా చర్యలు తీసుకోవాలని చైనా నిర్ణయించింది.  దీనిపై స్పందించేందుకు నేపాల్ అధికారులు తిరస్కరించారు. 


Updated Date - 2021-05-11T21:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising