ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవలం భర్తపై పంతం నెగ్గడానికి కోర్టులో మిస్పింగ్ పిటీషన్ వేసిన మహిళ.. కోర్టు ఆమెకు ఏ శిక్ష విధించిదంటే..

ABN, First Publish Date - 2021-11-16T12:22:10+05:30

చెన్నైలో నివసించే ఒక మహిళ తన భర్త కనబడటం లేదని ఇటీవలే మద్రాస్ హై కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆమె భర్త మిలిటరిలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ సెప్టెంబర్ 15 నుంచి తన భర్త కనిపించడం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడమంటే సినిమాల పుణ్యమా అని ఇప్పడు అందరూ తెలుసుకుంటున్నారు. ఇటీవలే ఓటీటీలో జై భీమ్ అనే సినిమా కూడా వచ్చింది. అందులో లాయర్ అయిన హీరో ఒక వ్యక్తి కనబడటం లేదని కోర్టులో హేబియస్ కార్పస్ పిటీషన్ వేస్తాడు. అసలు హేబియస్ కార్పస్ పిటీషన్ వేయడమంటే ఒక తప్పిపోయిన వ్యక్తిని లేదా మిస్సింగ్‌లో ఉన్న వ్యక్తి కోర్టులో హాజరు పరచాల్సిందిగా పిటిషన్ వేయడం. కోర్టు సదరు తప్పిపోయిన వ్యక్తి జాడ కనుక్కొని హాజరు పరచాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిస్తుంది. 


చెన్నైలో నివసించే ఒక మహిళ తన భర్త కనబడటం లేదని ఇటీవలే మద్రాస్ హై కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆమె భర్త మిలిటరిలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ సెప్టెంబర్ 15 నుంచి తన భర్త కనిపించడం లేదని.. తమ కుటంబమంటే గిట్టని వారు కొందరు తన భర్తని ఏదో చేసినట్టు అనుమానంగా ఉందని ఆమె తన పిటీషన్‌లో పేర్కొంది. హై కోర్టు ఆమె పిటీషన్‌ను స్వీకరించి పోలీసులకు ఆమె భర్తను వెతికి కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశమిచ్చింది. 


పోలీసులు ఈ కేసుని త్వరగానే ఛేదించారు. ఆమె భర్త సురక్షితంగా ఉన్నాడని, రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడని పోలీసులు కోర్టుకి తెలిపారు. అయితే పిటీషన్ వేసిన సదరు భార్య కూడా తన భర్తతో తరుచూ మాట్లాడుతున్నట్లు కూడా వారు తమ నివేదికలో పేర్కొన్నారు. దీంతో హై కోర్టు న్యాయ మూర్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆమె భర్త ఎక్కడున్నాడో తెలిసి కూడా.. ఎందుకు హేబియస్ కార్ఫస్ పిటీషన్ వేశావు అని ప్రశ్నించారు.


అందుకు సమాధానంగా ఆమె వివరిస్తూ.. తన భర్త చాలా కాలంగా ఇంటికి రాలేదని, తనతో సరిగా మాట్లడటంలేదని.. త్వరగా ఇంటికి రప్పించాలని ఈ పిటీషన్ వేశానని తెలిపింది. దీంతో హై కోర్టు ఆమెకు రూ.15 వేలు జరిమానా విధించింది. విలువైన కోర్టు సమాయాన్ని వ‌ృథా చేసినందుకు తీవ్రంగా మండిపడింది. మరోసారి ఇలా చేస్తే జైలు శిక్ష తప్పదని ఆమెకు హెచ్చరించింది.

Updated Date - 2021-11-16T12:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising