ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మీరు సమస్యల్లో చిక్కుకున్నారా? ఏదీ కలిసిరావడం లేదా? ఈ చాణక్య సూత్రాలు మిమ్మల్ని విజయంవైపు పరిగెత్తిస్తాయి..

ABN, First Publish Date - 2021-10-07T12:21:33+05:30

మనిషి అత్యంత విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కూడా చాణక్యనీతి అతనికి సరైన మార్గాన్ని చూపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి అత్యంత విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కూడా చాణక్యనీతి అతనికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. చాణక్యుడు భారతదేశంలోని ఉత్తమ పండితులలో ఒకరు. చాణక్యను ఆచార్య చాణక్య అని కూడా పిలుస్తారు. చాణక్యుడు నాటి కాలంలో ప్రపంచ ప్రఖ్యాత తక్షశిలా విశ్వవిద్యాలయానికి సేవలు అందించాడు. ఆచార్య చాణక్య అక్కడి విద్యార్ధులకు చక్కటి విద్యను అందించేవాడు. ఎవరైనాసరే జీవితంలో విజయం సాధించాలనుకుంటే అందుకు ముందుగా తగిన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని ఆచార్య చాణక్య చెబుతాడు. ఆ తర్వాత ఆ లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. 


ఆచార్య చాణక్యకు జీవితంలో వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంది. అర్థశాస్త్రంతో పాటు, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సైనిక శాస్త్రం, దౌత్యం, మతం మొదలైన అంశాలలో చాణక్యుడు మంచి పరిజ్ఞానం కలిగివున్నాడు. చాణక్య బోధనలు ఈనాటికీ అందరికీ స్ఫూర్తినిస్తాయి. చాణక్య మాటలు నేటికీ సందర్భోచితంగా ఉన్నాయనడానికి కారణం ఇదే. చాణక్య నీతి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే కొన్ని విషయాలను ఎల్లప్పుడూ తప్పక గుర్తుంచుకోండి. 


అద్భుతమైన వ్యూహం: చాణక్య నీతి ప్రకారం... మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి ముందుగా దానికి చక్కని వ్యూహం అవసరం. చాణక్య చెప్పిన ఈ సూత్రం విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలకు కూడా వర్తిస్తుంది. తగిన ప్లానింగ్ లేనివారు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. తగిన వ్యూహాన్ని రూపొందించుకోవడం వలన ఆ పని మరింత సులభం అవుతుంది. ఇంతే కాదు అ వ్యక్తి  విజయావకాశాలను మరింత బలపరుస్తుంది.

టైమ్ మేనేజ్‌మెంట్: చాణక్య నీతి ప్రకారం... ఏదైనా పనిని పూర్తి చేయడానికి కాలపరిమితి అంటూ ఉండాలి. ఆ పనిని నిర్ణయించుకున్న కాల పరిమితిలో పూర్తి చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం వల్ల పనిని సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సమయ నిర్వహణ ప్రాముఖ్యత తెలియనివారు విజయానికి దూరమవుతారు.



Updated Date - 2021-10-07T12:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising