ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: స్త్రీకి సంబంధించిన ఈ రహస్యాలు తెలిస్తే పురుషులకు వారిపై మరింత గౌరవం పెరుగుతుంది..

ABN, First Publish Date - 2021-11-06T12:22:10+05:30

చాణక్య నీతిలో, ఆచార్య చాణక్యుడు.. మనిషి తన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతిలో, ఆచార్య చాణక్యుడు.. మనిషి తన గతం గురించి ఎప్పుడూ చింతించకూడదని, అలాగే భవిష్యత్తు గురించి ఆవేదన చెందకూడదని చెప్పాడు. భూత, భవిష్యత్ ఆలోచనలు విడిచిపెట్టి వర్తమానంలో జీవించాలని ఆచార్య చాణక్య సూచించారు. ఇదేవిధంగా స్త్రీ, పురుషులకు సంబంధించిన అనేక రహస్యాలను కూడా ఆచార్య చాణక్య తెలియజేశారు. 


పురుషులతో పోలిస్తే  స్త్రీలు రెట్టింపు ఆహారం తీసుకుంటారు. పురుషుల కన్నా స్త్రీలు నాలుగు రెట్లు తెలివైనవారు.  మగవారి కన్నా ఆరు రెట్లు అధిక ధైర్యం కలిగినవారు. ఈ కారణాల వలనే స్త్రీలు..పురుషులపై ఆధిపత్యాన్ని చెలాయించే సత్తా కలిగివుంటారని ఆచార్య చాణక్య తెలిపారు. 

ఆచార్య చాణక్యుని అభిప్రాయం ప్రకారం ప్రజలు ఆకలితో మమలమల మాడిపోతున్న దేశంలో హోమాలు నిర్వహిస్తూ ఎంతో విలువైన నెయ్యి, ఆహార ధాన్యాలు వాటిలో వేయడం దేశద్రోహం లాంటిది. ఇలాంటి చర్యలు భగవంతుని ఆరాధనలో గల మంచి ఉద్దేశ్యాన్ని కలుషితం చేస్తాయి. ముందుగా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలి. ఈ విధమైన  సేవా కార్యాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది.


ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగమనేది ఉంటుంది. మన రహస్యాలను ఇతరులకు తెలియజేయడం ద్వారా, మన చేతితో మన కంటిని పొడుచుకున్నవారం అవుతాము. 

ప్రతి స్నేహం వెనుక స్వార్థం దాగి ఉంటుందనేది చేదు నిజం. జ్ఞానమే మంచి మిత్రుడు. చదువుకున్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. అందాన్ని, యవ్వనాన్ని ఓడించే ఏకైక ఆయుధం జ్ఞానం. తెలివిగలవారు పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకుండా, ఉత్తమ కార్యాలు చేస్తూ జీవితం గడపాలి. రాజు, స్త్రీలు, అగ్ని మొదలైనవాటిని దూరం ఉంచకూడదు. అలాగని వాటికి మరీ దగ్గరగా కూడా ఉండకూడదు.

Updated Date - 2021-11-06T12:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising