ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: శత్రువులు మీపై దాడి చేయకుండా.. మీకు మోకరిల్లాలంటే.. మీ ప్రవర్తన ఇలా ఉండాలి!

ABN, First Publish Date - 2021-12-29T12:05:15+05:30

శత్రువు ఎంత శక్తివంతుడైనా, మనకున్న జ్ఞానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తెలిపిన ఈ కీలక విషయాలు శత్రువును మనముందు మోకరిల్లేలా చేస్తాయి. శత్రువును బలహీనంగా ఎప్పుడూ భావించకూడు. మీరు శత్రువులను ఓడించాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.

శత్రువు ఎంత శక్తివంతుడైనా, మనకున్న జ్ఞానం, అవగాహనతో అతన్ని ఓడించగలమని చాణక్య నీతి చెబుతోంది. ఎలాంటి శత్రువునైనా పరిగణలోకి తీసుకోవాలి. శత్రువును ఓడించడానికి చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపాడు.


అప్రమత్తంగా ఉండండి

చాణక్య నీతి ప్రకారం.. శత్రువును గుర్తించిన తర్వాత, అతను మనపై దాడి చేసేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. శత్రువు ఎల్లప్పుడూ మీ అజాగ్రత్తను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడనే విషయాన్ని గ్రహించండి. అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించండి. శత్రువుతో ఎదురయ్యే అన్ని పరిస్థితులలో ధైర్యంగా ఉండగలిగితే ఆ శత్రువు మనకు ఎటువంటి హాని చేయలేడు.

శరీరాన్ని, మనసును దృఢం చేసుకోండి

శత్రువును ఓడించాలంటే రెండు విషయాలలో జాగ్రత్తగా మెలగాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. మనిషి తన శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకోవాలి. మీరు శరీరకంగా, మానసికంగా బలంగా లేనంత కాలం.. శత్రువు మీపైదాడి చేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటాడు. దీనిని దృష్టిలో పెట్టుకుని మంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండండి. మనసును మెరుగ్గా ఉంచడానికి జ్ఞానాన్ని స్వీకరించండి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

మనిషికి ఉండే చెడు అలవాట్లు.. అతనిపై దాడి చేసేందుకు శత్రువులకు అవకాశాన్ని కల్పిస్తాయని చాణక్య నీతి చెబుతుంది. శత్రువును ఓడించాలంటే కోపం, అహంకారం, అత్యాశ మొదలైనవి ఉండకూడదని చాణక్య సూచించారు. అలాగే మత్తు పదార్థాల సేవనం శత్రువులను దగ్గర చేసే చెడ్డ అలవాటని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. అందుకే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే శత్రువును ఓడించవచ్చని చాణక్య తెలిపారు.

Updated Date - 2021-12-29T12:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising