ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ విషయాల్లో సిగ్గుపడితే ఎన్నటికీ ఆనందాన్ని అందుకోలేరు.. అవేమిటో తెలుసుకుంటే అన్నింటా విజయమే!

ABN, First Publish Date - 2021-11-02T12:33:00+05:30

ఆచార్య చాణక్య తన పుస్తకం చాణక్యనీతిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తన పుస్తకం చాణక్యనీతిలో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలను తెలియజేశారు. చాణక్య తెలిపిన జీవన విధానాలను అవలంబిండచం ద్వారా మనిషి తన జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే జీవితంలో కొన్ని విషయాల్లో మొహమాటం లేదా సిగ్గు పడితే అమూల్యమైన ప్రయోజనాలను కోల్పోతాడని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.. 


భార్య నుంచి ప్రేమను పొందడంలో..

పురుషుడు రాత్రి పడుకునే ముందు తన భార్య నుంచి ప్రేమను కోరే విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే సాధారణంగా భార్య తాను కోరుకుంటున్న ప్రేమను అందించమని భర్తకు చెప్పలేదు. అందుకే భార్య నుంచి ప్రేమను పొందే విషయంలో భర్తే చొరవ చూపాలి. ఈ విధంగా చేయడం వలన మీ భార్య ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు మీకు ఇల్లే ఒక స్వర్గసీమలా మారుతుంది. భార్య ఇంట్లో ఆనందంగా తిరుగాడుతుంటే ఆ ఇంట్లో లక్షీదేవి నివసిస్తుంది. 

విద్యను నేర్చుకోవడంలో..

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనిషి చదువు నేర్చుకోవడంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఏ విద్యార్థి అయినా అధ్యాపకుని దగ్గర విద్య నేర్చుకోవడంలో, సందేహాలు తీర్చుకోవడంలో సిగ్గుపడితే అతను ఎన్నటికీ అభివృద్ధి చెందలేడు. 


భోజనం చేయడంలో..

చాణక్య నీతిని అనుసరించి.. భోజనం చేయడంలో ఎవరైనాసరే సిగ్గుపడకూడదు. చాలామంది ఇతరుల ఇంటికి అతిథులుగా వెళ్లినపుడు భోజనం చేసే విషయంలో మొహమాట పడుతుంటారు. ఇలా చేయడం వలన వారు ఆకలిలో ఉండాల్సివస్తుంది. మనిషి ఎప్పడూ ఆకలిని అణచివేయకూడదు. ఇలా చేయడం వలన అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. 

డబ్బులు అడిగే విషయంలో..

చాలామంది డబ్బులు అడిగే విషయంలో మొహమాట పడుతుంటారు. ఇలాంటివారు ఎప్పుడూ సమస్యలను పరిష్కరించుకోలేరు. విజయం సాధించలేరు. మనిషి తనకు ఇతరుల నుంచి రావాల్సిన డబ్బులను అడగడంలో మొహమాటపడి వెనుకడుగు వేయకూడదు. అలాగే తన సమస్యలను పరిష్కరించుకునే విషయంలోనూ ఎవరినైనా డబ్బును అడిగేందుకు వెనుకాడకూదు. ఈ విషయాల్లో మొహమాటానికి లోనయితే సమస్యలు పరిష్కారం కావని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-11-02T12:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising