ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఆ రెండు అంశాలు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు.. దాంపత్య జీవితం అస్తవ్యస్తం.. మరి ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-12-01T12:27:44+05:30

వైవాహిక జీవితంలో వివాదాలు చోటుచేసుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో వివాదాలు చోటుచేసుకుంటే.. జీవితమంతా కష్టాలమయం అవుతుంది. అందుకే భార్యాభర్తల బంధం ధృఢంగా ఉండాలంటారు. హిందూ సంప్రదాయంలో భార్యాభర్తలిద్దరికీ సమాన హోదా కల్పించారు. ఆచార్య చాణక్య భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి వివరంగా తెలిపారు. వైవాహిక జీవితం సంతోషంగా గడవాలంటే భార్యాభర్తలు ఏఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలియజేశారు. ఇంతేకాకుండా భార్యాభర్తల అనుబంధాన్ని దిగజార్చే విషయాల గురించి ఆచార్య చాణక్య తెలియజేశారు. 


నమ్మకం

భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోతే వారి జీవితం కలహాలు, విబేధాలతోనే గడిచిపోతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే భార్యాభర్తలు ఒకరిపైమరొకరు అనుమానపు దృష్టితో ఉండకూడదు.  దాంపత్య జీవితంలో ప్రేమతో పాటు నమ్మకం కలిగివున్న జంటల జీవితం సంతోషంగా గడుస్తుంది. సంసారంలో ఎదురయ్యే ప్రతి అంశంలోనూ భార్యాభర్తలు కలిసి చర్చించుకోవాలి. ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం ఉంటుంది. దానిని కనుగొని జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలి. అటువంటప్పుడు దాంపత్య జీవితంలో ఎంత కష్టం ఎదురైనా తేలికగా బయటపడగలుగుతారు. అంతేకాకుండా ప్రశాంతత, ప్రేమ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

గౌరవం 

చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన జీవితం కోసం తపించే భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే ముఖ్యంగా వారి మధ్య పరస్పర గౌరవ భావన ఉండాలి. భార్యాభర్తలు నిరంతరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే వారి బంధం బలంగా, సంతోషకరంగా మారుతుంది. ఇద్దరి మధ్య గౌరవభావం లేకపోతే వారి సంబంధంలో బీటలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. అటువంటి పరిస్థితుల్లో వారి దాంపత్య జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇది వారిద్దరికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబమంతటిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-01T12:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising