ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైలట్‌‌పై పిల్లి దాడి.. విమానంలో కల్లోలం..!

ABN, First Publish Date - 2021-03-05T03:03:33+05:30

కటార్‌కు వెళుతున్న ఓ విమానంలో పిల్లి కలకలం సృష్టించింది. కాక్‌పిట్‌లోని పైలట్‌పై దాడి చేసింది. దాన్ని బంధించడం సాధ్యం కావడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కటార్‌కు వెళుతున్న ఓ విమానంలో పిల్లి కలకలం సృష్టించింది. కాక్‌పిట్‌లోని పైలట్‌పై దాడి చేసింది. దాన్ని బంధించడం సాధ్యం కావడంతో పైలట్  విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. టార్కో ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం బుధవారం నాడు సుడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ నుంచి కటార్ వైపు ప్రయాణం ప్రారంభించింది. అయితే..టేకాఫ్ అయిన అరగంట తరువాత విమాన సిబ్బంది కాక్‌పిట్‌లో పిల్లిని గుర్తించారు. దాన్ని వారు బంధించే ప్రయత్నం చేయాగా అది  పైలట్‌పై దాడి చేసింది. దాన్ని బంధించడం సాధ్యం కాదని నిర్ణయించిన పైలట్ విమాన్ని అత్యవసరంగా ఖార్టూన్ విమానాశ్రయంలో దించేశాడు. అంతకు ముందు రోజు రాత్రి ఎయిర్‌పోర్ట్‌లో నిలిపి ఉంచిన విమానంలోకి పిల్లి ప్రవేశించి ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. విమాన్నాన్ని శుభ్రపరిచేందుకు అధికారులు విమానాన్ని అక్కడ పార్క్ చేశారు. 


అయితే..పిల్లికి విమానం కొత్త ప్రదేశం కావడంతో అది భయాందోళలనకు లోనై పైలట్‌పై దాడి చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ..ఇటువంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. గతేడాది గోయిర్ విమానంలోకి రెండు పావురాళ్లు ప్రవేశించి కలకలం రేపాయి. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లేందుకు విమానం బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. దీని వల్ల గోఎయిర్ విమానం అరగంట ఆలస్యంగా తన గమ్యస్థానానికి చేరుకుంది. 

Updated Date - 2021-03-05T03:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising