ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: ఓ వైపు మ్యాచ్ జరుగుతుంటే.. ఆ కెమెరామెన్ చేసిన పనికి..

ABN, First Publish Date - 2021-07-30T00:40:48+05:30

ఈ మారు టోక్యో ఒలింపిక్స్ క్రీడాభిమానులకు, నెటిజన్లకు బోలెడన్నీ వైరల్ వీడియోలు అందించింది. కానీ..ఇప్పటివరకూ వచ్చిన వాటన్నిటినీ తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: క్రీడాభిమానులకు, నెటిజన్లకు టోక్యో ఒలింపిక్స్ బోలెడన్నీ వైరల్ వీడియోలను అందించింది. కానీ..ఇప్పటివరకూ వచ్చిన వాటన్నిటినీ తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ వీడియో పుణ్యమా అని ఓ బొద్దింక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బొద్దింకకు ఒలింపిక్స్‌కూ సంబంధం ఏంటీ అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..! ఇటీవల అర్జెంటీనా, స్పెయిన్ మహిళల జట్ల మధ్య హాకీ మ్యాచ్ జరిగింది. ఈ పోటీని అర్జెంటీనాకు చెందిన ఓ టీవీ ఛానల్ లైవ్‌లో ప్రసారం చేస్తోంది.


ఈ క్రమంలో.. ఓ క్రీడాకారిణి కొట్టిన షాట్‌ను రీప్లే చేసేందుకు ఆ ఛానల్ సిద్ధమైంది. ఆ రీప్లే మొదలయ్యే కొద్ది సెకన్లకు ముందు..కెమెరామెన్ అనూహ్యంగా ఓ బొద్దింకపై కెమెరా ఫోకస్ పెట్టాడు. ఇంకేముంది.. ఈ దృశ్యాలన్నీ లైవ్‌లో ప్రసారమైపోయాయి. స్క్రీన్‌పై కొన్ని సెకెన్ల మాత్రమే ఆ బొద్దింక కనిపించినప్పటికీ.. ప్రజలు మాత్రం నవ్వాపుకోలేక నానా అవస్థలు పడ్డారు. ‘‘మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటే మధ్యలో ఈ బొద్దింక ఏంటీ.. ఆ బొద్దింకపై కెమెరామెన్‌కు ఎందుకంత ఆసక్తీ..? నేషనల్ జాగ్రఫిక్ చానల్‌లో ఉద్యోగం కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడా..?’’ అంటూ కెమెరామెన్ మీద ఛలోక్తుల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా బొద్దింకలకూ స్థానం లభించింది’’ అంటూ మరికొందరు కామెడీలు చేశారు. నెటిజన్లను ప్రస్తుతం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేస్తే పోలా.. 



Updated Date - 2021-07-30T00:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising