ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.. ఆమె ముందే క్యాబ్‌లో డ్రైవర్ చేసిన పనికి షాక్..!

ABN, First Publish Date - 2021-12-04T17:59:04+05:30

ఆమె బెంగళూరులోని ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తోంది.. రాత్రి 2 గంటలకు డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె  బెంగళూరులోని ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తోంది.. రాత్రి 2 గంటలకు డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది.. కొంత దూరం వెళ్లగానే ఆమె డ్రైవర్ వైపు చూసింది.. తన ఎదురుగానే డ్రైవర్ చేస్తున్న పని చూసి షాకైంది.. వెంటనే గట్టిగా అరుపులు, కేకలు పెట్టింది.. భయపడిన డ్రైవర్ ఆమెను అక్కడే దించేసి వెళ్లిపోయాడు.. ఆమె ఆ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 


శుక్రవారం రాత్రి విధులు పూర్తయిన తర్వాత బాధిత మహిళ ఓలా క్యాబ్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆమె డ్రైవర్ చేస్తున్న పని చూసి షాకైంది. ఆ డ్రైవర్ ఆమె ఎదురుగానే ఫ్యాంట్ జిప్ తీసి స్వయంతృప్తి పొందుతున్నాడు. దీంతో భయపడిన మహిళ గట్టిగా అరుపులు, కేకలు వేసింది. దీంతో అతను ఆమెను మధ్యలోనే దింపేసి వెళ్లిపోయాడు. ఆమె మరో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లింది. అనంతరం బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. 


ఆమె పోస్ట్‌కు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ స్పందించారు. `అలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. నిందితుడిని పట్టుకునే ప్రక్రియను మేం ప్రారంభించాం. మరిన్ని వివరాలు కోసం మిమ్మల్ని పోలీసులు సంప్రదిస్తారు. ఓలా యాజమాన్యం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామ`ని రిప్లై ఇచ్చారు. కాగా, నిందితుడిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఓలా యాజమాన్యం ప్రకటించింది. 

Updated Date - 2021-12-04T17:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising