ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్న హత్య కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన తమ్ముడు.. ఇంతలో ఊహించని ఘోరం.. ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-24T16:24:22+05:30

హరియాణాలోని రోహ్‌తక్ రోడ్డు సమీపంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరియాణాలోని రోహ్‌తక్ రోడ్డు సమీపంలోని చౌడీ గల్లీలో సిమెంట్ వ్యాపారితోపాటు అతని మేనల్లునిపై దుండగులు తుపాకీతో 25 రౌండ్ల కాల్పులు జరిపారు. 5 తూటాలు తగిలి వ్యాపారి మృతి చెందాడు. వ్యాపారి మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు..కొంతకాలం క్రితం జరిగిన అతని సోదరుని హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి. అతను కోర్టులో సాక్ష్యం చెప్పేంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పోలీసులు 12 మంది అనుమానితులపై కేసు నమోదు చేశారు. వ్యాపారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.




వివరాల్లోకి వెళితే చౌడీ గల్లీ నివాసి శ్యామ్ సుందర్(54) మంగళవారం ఉదయం సిమెంట్ స్టోర్‌ కౌంటర్‌లో కూర్చుని టీ తాగుతున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు అక్కడికి వచ్చి, శ్యామ్ సుందర్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని అరుపులు విన్న అతని మేనల్లుడు హన్నీ(28) అక్కడికి వచ్చాడు. దుండగులు అతనిపై కూడా కాల్పుటు జరిపారు. దీంతో అతను కూడా గాయపడ్డాడు. వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే శ్యామ్ సుందర్, హన్నీలను ఆసుపత్రికి తరలించారు. శ్యామ్ సుందర్‌ను పరిశీలించిన వైద్యులు అతను మృతి చెందాడని నిర్ధారించారు. కాగా ఈ ఘటనంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. కాగా శ్యామ్ సుందర్ సోదరుడు పురుషోత్తమ్ 2016లో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకేసులో శ్యామ్ సుందర్ ప్రత్యక్ష సాక్షి. నవంబరు 24న కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. ప్రస్తుతం గాయపడిన హన్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హన్నీ ఫిర్యాదు మేరకు కొందరు అనుమానితుపై కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై డీఎస్పీ ధర్మవీర్ ఖబ్ర్ మాట్లాడుతూ పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగివుంటుందన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-11-24T16:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising